...
...
Next Story

Telugu Web Series: రెండు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. టీమ్ లీడర్‌తోనే.. క్రేజీ రికార్డు

Telugu Web Series: తెలుగు కామెడీ వెబ్ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో దుమ్ము రేపుతోంది. ఒక ఓటీటీలో అయితే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ క్రేజీ రికార్డు అందుకుంది.

Published on: Oct 12, 2026, 18:53:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Telugu Web Series: తెలుగు ఓటీటీ స్పేస్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచిన సరికొత్త రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ వెబ్ సిరీస్ ఏకంగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి డిజిటల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈటీవీ విన్ (ETV Win)తో పాటు ప్రముఖ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు యూత్‌ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

Telugu Web Series: రెండు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. టీమ్ లీడర్‌తోనే.. క్రేజీ రికార్డు
Telugu Web Series: రెండు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. టీమ్ లీడర్‌తోనే.. క్రేజీ రికార్డు

బాబు డేగల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 6 ఎపిసోడ్ల మినీ సిరీస్, పెళ్లి మార్కెట్లో కుర్రాళ్ళు ఎదుర్కొనే వాస్తవిక ఇబ్బందులను ఎంతో సరదాగా తెరపై ఆవిష్కరించింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎందుకంత ఆదరణ లభిస్తుందో చూడండి.

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశేషాలు

టైటిల్ : Least Eligible Bachelor (లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

ఓటీటీ : ఈటీవీ విన్ & నెట్‌ఫ్లిక్స్

ఎపిసోడ్లు : 6 ఎపిసోడ్లు

జానర్: రొమాంటిక్ కామెడీ

నటీనటులు : హర్షా చెముడు, ఐశ్వర్య హోళక్కల్, హైపర్ ఆది, శ్రీవిద్య, జీవన్ కుమార్

డైరెక్టర్ : బాబు డేగల

మ్యూజిక్ డైరెక్టర్ : అజయ్ అరసాడ

రిలీజ్ డేట్ : అక్టోబర్ 9, 2026

ఈటీవీ విన్‌లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్

ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. “100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఇంకా ఎంతో ఎక్కువగా నవ్వులు, ప్రేమ.. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. విన్ ఒరిజినల్ సిరీస్.. మనసులు గెలుచుకుంటోంది” అనే క్యాప్షన్ తో ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు స్టోరీ ఏంటంటే?

పెళ్లి చూపుల్లో తనను రిజెక్ట్ చేస్తుందనుకున్న అమ్మాయి.. ఆరు నెలల పాటు లివిన్ రిలేషన్షిప్ కండిషన్ పెట్టడంతో అబ్బాయి షాకవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల పెళ్లి జరిగిందా? లేదా అన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ ఆఫీస్ డ్రామా, రొమాంటిక్ చిలిపి గొడవలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

ఎవరెలా చేశారంటే?

నటుడిగా హర్ష చెముడు తనదైన సహజమైన ఎక్స్‌ప్రెషన్స్, అండర్‌స్టేటెడ్ కామెడీ టైమింగ్‌తో సిరీస్‌ను ముందుండి నడిపించారు. ఏదో కృత్రిమంగా కాకుండా సిట్యుయేషనల్ కామెడీతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఇక హైపర్ ఆది తన ట్రేడ్‌మార్క్ పంచ్ డైలాగ్స్‌తో నవ్వులు పూయించగా, శ్రీవిద్య, జీవన్ కుమార్ సహాయక పాత్రల్లో మంచి టైమింగ్ క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకున్నారు. అజయ్ అర్సాడ అందించిన సంగీతం సన్నివేశాలకు తగినట్లుగా ఎంతో ఉత్సాహాన్ని నింపింది.

వీకెండ్ బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్

కథ పరంగా రొటీన్ రూరల్-టు-అర్బన్ రొమాన్స్ టెంప్లేట్ అయినప్పటికీ, స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా సాగడంతో ఆడియన్స్ బోర్ ఫీలయ్యే అవకాశం లేదు. మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, ఆఫీస్ పాలిటిక్స్ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఈ సిరీస్ చక్కటి ఆప్షన్.

100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని దాటి దూసుకెళ్తున్న ఈ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓటీటీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లలో దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks