Telugu Web Series: తెలుగులో మరో ఫన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మధ్య ఒరిజినల్ కంటెంట్ తో స్పీడు పెంచుతున్న ఈటీవీ విన్ ఓటీటీయే ఈ సరికొత్త సిరీస్ ను తీసుకురాబోతోంది. స్టార్ కమెడియన్ హర్ష చెముడుతో లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే ఈ సిరీస్ ను నిర్మించగా.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు ఈ టీజర్ ను లాంచ్ చేశారు. రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసి ఈ టీజర్ తీసుకొచ్చారు.
లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ టీజర్

తాజాగా విడుదలైన 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. బ్యాచిలర్ లైఫ్‌లో ఎదురయ్యే వింత పరిస్థితులు, ఆఫీస్ వర్క్ ప్రెజర్, సహోద్యోగుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ఫన్నీ సీన్లతో ఈ టీజర్‌ను చాలా కలర్‌ఫుల్‌గా కట్ చేశారు.
"బ్యాచిలర్ లైఫ్.. ఆఫీస్ డ్రామా.. అన్‌లిమిటెడ్ మ్యాడ్‌నెస్" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి కోసం తంటాలు పడే కొడుకు, ఓ అమ్మాయిని ప్రేమించమని వెంటపడే తండ్రి చుట్టూ తిరిగే సిరీస్ ఇది. నాన్సెన్స్ కామెడీ అంటూ టీజర్ లోనే మేకర్స్ అనౌన్స్ చేయడం విశేషం.
ఈ టీజర్ లో హర్ష చెముడు తన టైమింగ్ తో అదరగొట్టగా.. తన మార్క్ కామెడీతో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా అలరించాడు. ఈ టీజర్ చూస్తుంటే అన్‌లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అని అర్థమవుతోంది.
సెప్టెంబర్ 30 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్
ఈ కామెడీ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో కూడా ఈటీవీ విన్ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబర్ 30 నుంచి 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సిరీస్ కేవలం ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి రానుంది. నెల ఆఖరిలో ఓటీటీ ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని పంచేందుకు ఈ షో సిద్ధమవుతోంది. నిజానికి సెప్టెంబర్ 18 నుంచే అని ముందు చెప్పినా ఇప్పుడు వాయిదా వేశారు.
యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు, సిరీస్‌లు అందిస్తున్న ఈటీవీ విన్.. ఈ సిరీస్‌తో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
రూట్ మార్చిన ఈటీవీ విన్.. యూత్‌ను టార్గెట్ చేస్తూ వరుస సిరీస్‌లు
{{/usCountry}}యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు, సిరీస్‌లు అందిస్తున్న ఈటీవీ విన్.. ఈ సిరీస్‌తో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
రూట్ మార్చిన ఈటీవీ విన్.. యూత్‌ను టార్గెట్ చేస్తూ వరుస సిరీస్‌లు
{{/usCountry}}ఇటీవలి కాలంలో తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఈ రేసులో ఈటీవీ విన్ ప్రత్యేకమైన రూట్ ఎంచుకుంది. రొటీన్ ఫ్యామిలీ డ్రామాలకే పరిమితం కాకుండా నేటి తరం ఆలోచనలకు తగ్గట్లుగా యూత్‌ఫుల్ కామెడీ కంటెంట్ అందిస్తోంది.
గతంలో వచ్చిన '#90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్', 'ఆల్ ఇండియా ర్యాంకర్స్' వంటి డిజిటల్ ప్రొడక్షన్స్ మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. అదే తరహాలో బ్యాచిలర్స్ కథతో రాబోతున్న ఈ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా డిజిటల్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.