Ee Paata Korinavaru Nemalipalem Nundi Rama Jyotsna Nandu Murali Kabir Dhol Ravi Modalaguvaru: ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, “ఇదీ సంగతి”, ‘ఆటగదరా శివా’ తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్.
డిఫరెంట్ టైటిల్ అండ్ క్యాప్షన్

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. దీనికి ‘ఏ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఏ ఫర్‌బిడెన్ సాగా’ అనేది క్యాప్షన్.
దర్శక రచయిత మదన్ అందించిన కథ
ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొదటి మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్
సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ జోనర్ సినిమా.
సంగీతం, ధ్వని, మానవ మెదడుకు సంబంధం
సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.
నా ఫ్రెండ్ చనిపోయే ముందు ప్లాన్ చేసిన మూవీ
{{/usCountry}}సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.
నా ఫ్రెండ్ చనిపోయే ముందు ప్లాన్ చేసిన మూవీ
{{/usCountry}}ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. "భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది. నా స్నేహితుడైన మదన్‌తో ఈ కథను సినిమాగా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా" అని అన్నారు.
పదిన్నర గంటలకు ఒకే పాట
"నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ ఉంటారు" అని చంద్ర సిద్ధార్థ్ చెప్పారు.
న్యూరోసైన్స్, అపరాధ భావన
"అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టాను. ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది" అని డైరెక్టర్ తెలిపారు.
నాలుగు పాటలున్నాయి
"ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ పేర్కొన్నారు.