Free Horror Thriller: మీకు హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా..అయితే తెలుగులో ఫ్రీగా ఈ సినిమాను చూసేయండి..క్లైమాక్స్ అదుర్స్!

Free Horror Thriller: మీరు హారర్ థ్రిల్లర్స్ లవర్సా? మైండ్ బ్లోయింగ్ సీన్లు, ట్విస్టులతో ఉండే దెయ్యం సినిమాలు అంటే ఇష్టమా? ఓటీటీలో ఇలాంటి కంటెంట్ చూస్తుంటారా? అయితే.. ఈ వార్త మీ కోసమే. హారర్ థ్రిల్లర్స్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించే తెలుగు మూవీని ఫ్రీగా చూడొచ్చు. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Nov 10, 2026, 13:05:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Free Horror Thriller: తెలుగు సినీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ ను మన ఆడియన్స్ చుస్తూనే ఉన్నారు. ఇక హారర్ థ్రిల్లర్ జోనర్, అందులోనూ తెలుగు సినిమాలకు ఉండే డిమాండ్ మామూలు కాదు. మరి అలాంటి ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాను ఫ్రీగా చూడొచ్చని మీకు తెలుసా?

మీకు హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా..అయితే తెలుగులో ఫ్రీగా ఈ సినిమాను చూసేయండి..క్లైమాక్స్ అదుర్స్!
మీకు హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా..అయితే తెలుగులో ఫ్రీగా ఈ సినిమాను చూసేయండి..క్లైమాక్స్ అదుర్స్!

అమరావతికి ఆహ్వానం

తెలుగులో ఇటీవల వచ్చిన అమరావతికి ఆహ్వానం సినిమాను ఫ్రీగా చూడొచ్చు. అవును.. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ ను యూట్యూబ్ లో ఉచితంగా వీక్షించొచ్చు. తెలుగు హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం ఈ ఫుల్ మూవీ ఫ్రీగా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రీత, శివ కంఠంనేని, భద్రమ్, హరీష్ తదితరులు నటించారు.

బాక్సాఫీస్ రిజల్ట్

తెలుగులో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అమరావతికి ఆహ్వానం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెంచాయి. కానీ ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. జీవీకే దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేకపోయింది.

ఈ ఓటీటీలో

అమరావతికి ఆహ్వానం మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఆహా వీడియో ఓటటీలోకి వచ్చింది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఫ్రీగా చూడాలనుకునే మూవీ లవర్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి సినిమా పేరు సెర్చ్ చేస్తే సరిపోతుంది.

కథ ఏమిటంటే?

అమరావతికి ఆహ్వానం సినిమా స్టోరీ ఓ రివేంజ్ హారర్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఈ సినిమాలో సీఐ ఈశ్వర్ (శివ కంఠంనేని) సస్పెన్షన్ లో ఉంటాడు. ఆయన భార్య పేరు భానుమతి (ధన్య). సస్పెండ్ అయి ఇంట్లో ఉండే సీఐ ఈశ్వర్, భానుమతితో పాటు భార్గవి కలిసి అమరావతి అనే గ్రామానికి వెళ్తారు.

భానుమతి (సుప్రీత) ఏమో యూట్యూబ్ లో పాపులర్ కావడం కోసం వీడియోలు చేస్తుంటుంది. ఈ ముగ్గురు కలిసి అమరావతి అనే ఊర్తో దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని నిరూపించడానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కథ అడ్డం తిరుగుతుంది. అక్కడి జమీందార్ వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్) హత్యకు గురవుతుంది. ఆమె దెయ్యంగా మారి వస్తుంది.

అసలు రాజేశ్వరిని ఎవరు హత్య చేశారు? రాజేశ్వరి కారణంగా ఈశ్వర్, భానుమతి, భార్గవి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అదిరిపోయే క్లైమాక్స్? ఏంటీ అన్నది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More