ఓటీటీ ఆడియన్స్ కు తెలుగు హారర్ థ్రిల్లర్ ‘మారీచ’ సడెన్ సర్ ప్రైజ్ వచ్చింది. నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఇవాళ నుంచి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మారీచ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.
మారీచ ఓటీటీ

సండేను స్పెషల్ గా మారుస్తూ ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ ‘మారీచ’ వచ్చేసింది. ఇవాళ (ఏప్రిల్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.
ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో
మారీచ మూవీ ఒకేసారి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజైంది. ప్రైమ్ వీడియోతో పాటు హంగామా ఓటీటీ, వాచో, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, టాటా ప్లే, సన్ నెక్ట్స్ లో మారీచ రిలీజైంది. అయితే ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంట్ విధానంలో మాత్రమే మారీచ ప్లే అవుతుంది. అంటే సబ్ స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాను రెంట్ పే చేసి చూడాల్సిందే.
థియేటర్ రిలీజ్
ఫస్ట్ మారీచ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో అతాన్ సంతోష్, అజామ్, సయ్యద్ గౌస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి శివాజీ, సురేష్ కలిసి దర్శకత్వం వహించారు. ఘంటసాల విశ్వనాథ్ మ్యూజిక్ డైరెక్టర్.
మారీచ స్టోరీ
మారీచ సినిమాను మిస్టరీతో కూడిన హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. యోగాపురం ఓ అందమైన పల్లెటూరు. అయితే ఆ గ్రామాన్ని ఓ దుష్టశక్తి పీడిస్తుంటుంది. దీని కారణంగా ఆ ఊర్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. జనాలు భయపడతారు.
ఆ ట్విస్ట్
{{/usCountry}}మారీచ సినిమాను మిస్టరీతో కూడిన హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. యోగాపురం ఓ అందమైన పల్లెటూరు. అయితే ఆ గ్రామాన్ని ఓ దుష్టశక్తి పీడిస్తుంటుంది. దీని కారణంగా ఆ ఊర్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. జనాలు భయపడతారు.
ఆ ట్విస్ట్
{{/usCountry}}అంతుచిక్కని ఆ దుష్ట శక్తి కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటాయి. అప్పుడే హీరో రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ప్రాణాలు తీస్తున్న ఆ దుష్ట శక్తి ఎవరు? దాన్ని హీరో ఎలా అంతం చేయగలిగాడు? అన్నది మారీచ సినిమాలో చూడాల్సిందే.
మొదటి ఘట్టం
మారీచ మూవీని పార్ట్ లుగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మారీచ సినిమా మొదటి ఘట్టంగా రిలీజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఫ్రాంఛైజీలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశముంది. డైరెక్టర్లు శివాజీ, సురేష్ కు ఇదే ఫస్ట్ మూవీ కావడం గమనార్హం.