Telugu OTT:ఓటీటీలో లేటెస్ట్ తెలుగు సినిమాలు కావాలా?ఈ రెండు మీ కోసమే-దేవుడు ఇచ్చిన పుస్తకం-ప్రేయసి కోసం పోరాటం-లుక్కేయండి

Telugu OTT: ఓటీటీలో రెండు లేటెస్ట్ తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. తెలుగు డిజిటల్ ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇందులో ఒకటి ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ కాగా.. మరొకటి యాక్షన్ థ్రిల్లర్. వెంటనే ఈ రెండు సినిమాలపై ఓ లుక్కేయండి. 

Published on: Aug 20, 2026, 12:58:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu OTT:డిజిటల్ వినోదాన్ని కోరుకునే ఓటీటీ ప్రియులకు టాలీవుడ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన రెండు ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు ఇప్పుడు ఓటీటీ వేదికలపైకి అడుగుపెట్టాయి.

ఓటీటీలో లేటెస్ట్ తెలుగు సినిమాలు కావాలా?ఈ రెండు మీ కోసమే-దేవుడు ఇచ్చిన పుస్తకం-ప్రేయసి కోసం పోరాటం-లుక్కేయండి
ఓటీటీలో లేటెస్ట్ తెలుగు సినిమాలు కావాలా?ఈ రెండు మీ కోసమే-దేవుడు ఇచ్చిన పుస్తకం-ప్రేయసి కోసం పోరాటం-లుక్కేయండి

ఓటీటీలోకి తెలుగు సినిమాలు

సీనియర్ హీరో శ్రీకాంత్, లయ కాంబినేషన్‌లో వచ్చిన సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. దీంతో పాటు ఘట్టమనేని వారసుడు జయకృష్ణ అరంగేట్రం చేసిన మాస్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం' డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేశాయి.

మిస్టర్ మిడిల్ క్లాస్ ఓటీటీ

డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ చిత్రం 'మిస్టర్ మిడిల్ క్లాస్' 2026 జూలై 17న థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత శ్రీకాంత్, లయ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు 19, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అయిన 'ఆహా' (Aha Video), 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) లలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే?

సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకటరమణ ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార సమస్యలతో సతమతమవుతుంటాడు. అలాంటి సమయంలో స్వయంగా శ్రీ వేంకటేశ్వర స్వామి అతని ముందుకు వచ్చి, రాసిన కోరికలను నిజం చేసే ఒక మాయా పుస్తకాన్ని ప్రసాదిస్తాడు. ఆ దివ్య పుస్తకం వేరొకరి చేతుల్లోకి మారిన తర్వాత ఎదురైన విచిత్ర పరిస్థితులు, కుటుంబ భావోద్వేగాలు, హాస్య సన్నివేశాల సమాహారమే ఈ చిత్ర కథ.

బ్లూ.జె క్రియేషన్స్ (Blu.j Creations) పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించగా.. సునీల్, అలీ, వెన్నెల కిషోర్ తమ మార్కు కామెడీతో అలరించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతం కథనానికి మరింత బలాన్ని ఇచ్చింది.

శ్రీనివాస మంగాపురం ఓటీటీ

మరోవైపు ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడానీ జంటగా పరిచయమైన రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం' కూడా ఓటీటీలోకి వచ్చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 20, 2026 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అనే ఐదు భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు.

స్టోరీ ఇదే

బళ్లారి నుంచి తిరుపతికి వచ్చిన శ్రీను అనే యువకుడు.. స్థానిక ఫ్యాక్షన్ నాయకుడు పెద్దిరెడ్డి కుమార్తె మంగతో ప్రేమలో పడతాడు. అయితే శ్రీను గతం వెనుక ఉన్న 'వాసు బాబు' అసలు గుర్తింపు, వెంకటప్పయ్య నాయుడితో ఉన్న పాత శత్రుత్వం బయటకు రావడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. మంగను దక్కించుకోవడానికి, వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి శ్రీను ఎదుర్కొన్న సవాళ్లే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయకుడిగా వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, అజయ్ భూపతి మార్కు టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More