...
...
Next Story

Today OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ టు సైకిల్ జర్నీ

Today OTT Telugu: ఇవాళ ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి మూడు సరికొత్త విభిన్నమైన తెలుగు సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో క్రైమ్ సస్పెన్స్, లవ్ డ్రామా, ఫ్రెండ్స్ జర్నీ మూవీస్ ఉన్నాయి. నేరుగా ఓటీటీలోనే రిలీజైన వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Jun 18, 2026, 09:08:37 IST
Advertisement

Today OTT Telugu: టాలీవుడ్‌లో మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలకు థియేట్రికల్ రన్ ఎంత రిస్క్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే చాలా మంది నిర్మాతలు ఇప్పుడు హోమ్ స్క్రీన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ (జూన్ 18) మూడు తెలుగు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఇవి మూడు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి.

జయముంది భయమేల మనసా (ETV Win Original)

ఇవాళ ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన మూడు తెలుగు సినిమాలు
ఇవాళ ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన మూడు తెలుగు సినిమాలు

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న 'ఈటీవీ విన్' ప్లాట్‌ఫామ్‌లో తాజాగా 'జయముంది భయమేల మనసా' అనే విన్ ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ ప్రీమియర్ అయింది. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సరికొత్త లవ్, ఫ్రెండ్ షిప్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా హోమ్ స్క్రీన్స్‌పై ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

కథ ఏంటి?

ముగ్గురు ఫ్రెండ్స్ సైకిళ్లపై లాంగ్ రోడ్ ట్రిప్ కు వెళ్లడం అనే స్టోరీ లైన్ చుట్టూ జయముంది భయమేల మనసా మూవీ తిరుగుతోంది. మరి ఆ ట్రిప్ లో ఏం జరిగిందో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇందులో భరణ్, రంజిత్, లీలా, శరణ్య తదితరులు నటించారు. ఓటీటీలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది మంచి ఆప్షన్.

థాంక్యూ సుబ్బారావు (Aha Video)

తెలుగు కంటెంట్‌తో దూసుకుపోతున్న 'ఆహా' ఈ వారం తన సబ్‌స్క్రైబర్ల కోసం అందిస్తున్న వినోదాత్మక చిత్రం 'థాంక్యూ సుబ్బారావు'. ఇది కామెడీ ప్లస్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆరు హత్యలు చేసిన గ్యాంగ్ ను పట్టుకోవడం కోసం హీరో హీరోయిన్ ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం ఇప్పటికే ఆహా ప్లాట్‌ఫామ్‌లో మంచి వ్యూవర్‌షిప్‌తో రన్ అవుతోంది.

ధైర్యే సాహసే అమృత (Aha Video)

ప్రస్తుత ఓటీటీ మార్కెట్‌ను గమనిస్తే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి గ్లోబల్ సంస్థలు కేవలం స్టార్ హీరోల చిత్రాలు లేదా భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లేనిదే చిన్న సినిమాలను అసలు పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు.

ఇలాంటి తరుణంలో ‘ఆహా’, 'ఈటీవీ విన్' సంస్థలు టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారాయి. తక్కువ బడ్జెట్‌తో కంటెంట్ నమ్ముకుని తీసే చిత్రాలకు ఈ ప్రాంతీయ ఓటీటీలు ఫ్యాన్సీ రేట్లతో 'డైరెక్ట్-టు-ఓటీటీ' లేదా 'పోస్ట్-థియేట్రికల్' డీల్స్ ఇస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకొస్తున్నాయి. వీకెండ్‌లో పెద్ద సినిమాల హడావుడి లేనప్పుడు ఇలాంటి చిన్న చిత్రాలే ఈ యాప్స్‌కు మెయిన్ వ్యూవర్‌షిప్ డ్రైవర్స్ కావడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks