...
...
Next Story

OTT Telugu Thriller: రెండు ఓటీటీల్లోనూ దుమ్మురేపుతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. అరెరే థియేటర్లో ఎలా మిస్ అయ్యాం?

OTT Telugu Thriller: ఓ తెలుగు సినిమా రెండు ఓటీటీల్లో అదరగొడుతోంది. ఒకేసారి రెండు ఓటీటీల్లో ట్రెండింగ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఉండే ట్విస్ట్ లు డిజిటల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అరెరే.. థియేటర్లలో ఈ మూవీని ఎలా మిస్ అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Published on: Oct 11, 2026, 15:36:04 IST
Advertisement

OTT Telugu Thriller: థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా పబ్లిసిటీకి నోచుకోలేకపోయిన మారెమ్మ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఆహా వీడియో, జియోహాట్‌స్టార్‌ ఓటీటీల్లో ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంత మంచి రూరల్ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ను థియేటర్లలో ఎలా మిస్ అయ్యామని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో రివ్యూలు రాస్తున్నారు.

మారెమ్మ ఓటీటీ

రెండు ఓటీటీల్లోనూ దుమ్మురేపుతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. అరెరే థియేటర్లో ఎలా మిస్ అయ్యాం?
రెండు ఓటీటీల్లోనూ దుమ్మురేపుతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. అరెరే థియేటర్లో ఎలా మిస్ అయ్యాం?

మారెమ్మ మూవీ ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో, జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ ఆడియన్స్ ను ఈ మూవీ ఎంటర్ టైన్ చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ భూపతిరాజు ఈ చిత్రంతో టాలీవుడ్‌ లో హీరోగా పరిచయమయ్యాడు. రస్టిక్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో పల్లెటూరి యువకుడి పాత్రలో మాధవ్ ఆకట్టుకున్నాడు.

హీరోయిన్‌గా దీపా బాలు నటించగా, కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, సీనియర్ నటుడు వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కనిపించారు. ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఈ మారెమ్మ సినిమా కథ మహిషాపురం అనే మారుమూల పల్లెటూరి చుట్టూ తిరుగుతుంది. గ్రామంలో ఏ ఉపద్రవం వచ్చినా గ్రామదేవత అయిన మారెమ్మ ఆగ్రహమే కారణమని ఊరి ప్రజలు బలంగా నమ్ముతారు. ఆ కోపాన్ని శాంతింపజేయడానికి ఒక దున్నపోతును మారెమ్మ పేరిట వదిలి, నిర్ణీత సమయానికి బలి ఇచ్చే సంప్రదాయం ఉంటుంది.

గ్రామంలో జరుగుతున్న వరుస అనర్థాల వెనుక ఉన్నది నిజంగానే దైవ ఆగ్రహమా లేక ఎవరైనా చేస్తున్న క్షుద్ర ప్రయోగాల పన్నాగమా అనేది కథలో ప్రధాన మలుపు.

తన మూగజీవాన్ని కాపాడుకోవడానికి కర్ణి ఎవరితో తలపడ్డాడు? మూఢనమ్మకాల వెనుక గ్రామ పెద్దలు దాచిన అసలు రహస్యాలేంటి? తప్పిపోయిన దున్నపోతు కథను ఎలాంటి మలుపు తిప్పిందనే అంశాలు సెకండాఫ్‌లో అదిరే థ్రిల్ కలిగిస్తున్నాయి.

ఈ సినిమాను ఎందుకు చూడాలి?

• రస్టిక్ నేటివిటీ: తెలంగాణ గ్రామీణ వాతావరణం, ఆచారాలు, మూఢనమ్మకాలు, పల్లెటూరి జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు.

• మాధవ్ నటన: డెబ్యూ మూవీ అయినా.. తీవ్ర భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల్లో మాధవ్ పరిణతి చెందిన నటనను ప్రదర్శించాడు.

• గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని సస్పెన్స్, హారర్, థ్రిల్ మూడ్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.

• కథనంలో వేగం: మిస్టరీ, రూరల్ క్రైమ్, దైవిక అంశాల కలయికతో రూపొందిన స్క్రీన్‌ప్లే ఓటీటీ ప్రేక్షకులను చివరిదాకా బోర్ కొట్టించకుండా కూర్చోబెడుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks