Top 6 Must Watch OTT Telugu Thrillers: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు కొత్త సినిమాల కోసం వేట మొదలుపెడతారు. థియేటర్లలో సందడి ఒకెత్తయితే, ఇళ్లలోనే కూర్చుని వేర్వేరు ఓటీటీల్లో సరికొత్త కంటెంట్ ఆస్వాదించడం మరో అనుభూతి.
టాప్ 5 ఓటీటీ థ్రిల్లర్స్

అందుకు తగ్గట్టే ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో పలు చిత్రాలు, సిరీస్‌లు డిజిటల్ తెరపైకి వచ్చాయి. యాక్షన్, డ్రామా, హారర్, కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ వరకు ప్రతీ రకమైన జోనర్ ఇష్టపడే వారి కోసం ఇంట్రెస్టింగ్‌గా అనిపించే టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
1. ది ప్యారడైజ్ (The Paradise)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
జోనర్: పీరియాడిక్ యాక్షన్ డ్రామా
కథ: 1980ల నాటి హైదరాబాద్ నేపథ్యంతో సాగే కథ ఇది. 14 ఏళ్ల జైలు శిక్ష ముగించుకుని తిరిగి వచ్చిన 'జడల్' (నాని), తన వెనుకబడిన వర్గాన్ని ఓ క్రూరులైన భూస్వాములు (రాఘవ్ జుయల్, మోహన్ బాబు) అణచివేస్తున్నాడని తెలుసుకుంటాడు. తన ప్రజల స్వేచ్ఛ కోసం, కుటుంబ పగ తీర్చుకోవడానికి అతను సాగించిన తిరుగుబాటే ఈ చిత్ర కథాంశం.
2. దహాన్ (Dahaan)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా (Aha)
జోనర్: హారర్ థ్రిల్లర్
కథ: ఒక పురాతన భవంతిలోని రహస్య పెట్టె నుంచి విడుదలైన దుష్టశక్తి, 'మను' అనే యువతిని ఆవహిస్తుంది. సమయం మించిపోకముందే ఆ భయంకరమైన శాపం నుంచి ఆ అమ్మాయిని కాపాడేందుకు ఆమె తోబుట్టువులు, ఒక స్థానిక పాస్టర్ కలిసి చేసే పోరాటమే ఈ కథ.
3. అయ్యన మనే 2 (Ayyana Mane 2)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5 (Zee5)
{{/usCountry}}ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5 (Zee5)
{{/usCountry}}జోనర్: సస్పెన్స్ మిస్టరీ డ్రామా
కథ: తన తరతరాల భవంతి బాధ్యతలను స్వీకరించిన 'జాజీ'కి బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అదే సమయంలో, చనిపోయిన తన అత్తగారి గొంతు ఆమెకు వినిపించడం మొదలవుతుంది. ఆ మరణం సహజమైనది కాదని అత్తగారి ఆత్మ చెప్పడంతో, ఆ భవంతిలో దాగిన రహస్యాలు, కుట్రల వెనుక ఉన్న అసలు సత్యాన్ని బయటపెట్టేందుకు జాజీ ప్రయత్నిస్తుంది.
4. వరం (Varam)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో-హాట్‌స్టార్ (JioHotstar)
జోనర్: ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా
కథ: పేదరికంలో ఉన్న రాజు అనే యువకుడికి ఊహించని విధంగా 'రేపటి వార్తలను ఈరోజే ముందే తెలుసుకునే' విచిత్రమైన శక్తి లభిస్తుంది. ఆ శక్తితో తన పేదరికాన్ని జయించి జీవితాన్ని మార్చుకోవాలని చూస్తాడు. అయితే, విధిని మార్చే క్రమంలో ఎదురయ్యే ప్రమాదకరమైన పరిణామాలు అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయనేది మిగతా స్టోరీ.
5. నా వైఫ్ మిస్సింగ్ (Naa Wife Missing)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా (Aha)
జోనర్: క్రిమినల్ మిస్టరీ థ్రిల్లర్
కథ: కొత్తగా పెళ్లైన ఒక దంపతుల సంతోషకరమైన జీవితంలో ఊహించని విధంగా భార్య అకస్మాత్తుగా కనిపించకుండాపోతుంది. భర్త పోలీసులను ఆశ్రయించడంతో, ఆమె గతం వెనుక ఉన్న అనేక రహస్యాలు, దాగి ఉన్న సత్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నమ్మకం, అబద్ధాల మధ్య సాగే ఆసక్తికరమైన మిస్టరీ డ్రామా ఇది.