...
...
Next Story

OTT Telugu: వీకెండ్ లో ఫన్ కావాలా? అయితే ఓటీటీని ఏలేస్తున్న 6 కొత్త తెలుగు సినిమాలు, సిరీస్‌లపై లుక్కేయండి

OTT Telugu: ఈ వీకెండ్ తెలుగు ఓటీటీ వీక్షకులను అలరించేందుకు పాపులర్ ఓటీటీల్లో ఆరు కొత్త సినిమాలు, సిరీస్ లు రెడీగా ఉన్నాయి. వీకెండ్ ఫన్ కావాలంటే వెంటనే ఓ లుక్కేయండి. ఇందులో డిఫరెంట్ జోనర్ సినిమాలు ఉన్నాయి.

Published on: Aug 1, 2026, 20:59:47 IST
Advertisement

OTT Telugu: తెలుగు డిజిటల్ స్పేస్‌లో ప్రస్తుతం కంటెంట్ విప్లవం నడుస్తోంది. రొటీన్ ఫార్ములా సినిమాల నుంచి పక్కకు వచ్చి కోర్ట్‌రూమ్ డ్రామాలు, పొలిటికల్ థ్రిల్లర్లు, పీరియాడికల్ స్టోరీలు, రియలిస్టిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు వీక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన ఆహా (Aha), ఈటీవీ విన్ (ETvWin), నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేయండి.

ఆజాదీ 501 (Azadi 501)

వీకెండ్ లో ఫన్ కావాలా? అయితే ఓటీటీని ఏలేస్తున్న 6 కొత్త తెలుగు సినిమాలు, సిరీస్‌లపై లుక్కేయండి
వీకెండ్ లో ఫన్ కావాలా? అయితే ఓటీటీని ఏలేస్తున్న 6 కొత్త తెలుగు సినిమాలు, సిరీస్‌లపై లుక్కేయండి

స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Video)

జోనర్: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

ప్రత్యేకత: దేశంలో కలకలం రేపిన ‘ఫ్రీడమ్ 251’ ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. ఆహా ఒరిజినల్స్‌లో వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్.. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

దీవానా (Deewana)

స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Video)

జోనర్: యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా

ప్రత్యేకత: నేటితరం ప్రేమ, ఆకర్షణ, మానసిక సంఘర్షణల నేపథ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్లను ఇష్టపడే యంగ్ ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకునే యువకుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

హరిచంద్ర కథ (Hari Chandra Katha)

స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Video)

జోనర్: యూత్ అండ్ ఎమోషనల్ డ్రామా

ప్రత్యేకత:ధర్మానికి ప్రతీకగా నిలిచే కథాంశాన్ని ఆధునిక డిజిటల్ ఫార్మాట్‌లోకి వెబ్ సిరీస్‌గా మార్చారు. నటీనటుల పెర్ఫార్మెన్స్, భావోద్వేగాలు ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.

సెకండ్ మ్యారేజ్ (Second Marriage)

జోనర్: రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామా

ప్రత్యేకత: తెలుగు నేటివిటీ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఈటీవీ విన్ నుంచి వచ్చిన మరో హృద్యమైన చిత్రం. సమాజంలో రెండో పెళ్లి పట్ల ఉండే ఆలోచనా దృక్పథం, భార్యాభర్తల ఎమోషనల్ బంధాన్ని ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రం.

రావు బహదూర్ (Rao Bahadur)

స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

జోనర్: సైకలాజికల్ థ్రిల్లర్

ప్రత్యేకత: నెట్‌ఫ్లిక్స్‌లో పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన ఈ తెలుగు చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ తెలుగు సినిమాలోనే ఓ డిఫరెంట్ ప్రయోగమని చెప్పొచ్చు.

అబ్జెక్షన్ మై లార్డ్ (Objection My Lord)

స్ట్రీమింగ్ వేదిక: జీ5 (ZEE5)

జోనర్: కోర్ట్‌రూమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

ప్రత్యేకత: న్యాయస్థానంలో సాగే హోరాహోరీ వాదనలు, నేర పరిశోధన ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న లీగల్ డ్రామా సిరీస్ ఇది. సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వీకెండ్ బింజ్-వాచ్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe