ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ.. అరుదైన స్ట్రీమింగ్ రికార్డు
ఓటీటీలో ఇప్పుడో తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అరుదైన స్ట్రీమింగ్ రికార్డును అందుకుంది. రోషన్ కనకాల లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.
సుమ-రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన రెండో సినిమా ‘మోగ్లీ’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో మాత్రం సునామీ సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ 13న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి రాగానే ఊహించని రేంజ్ లో వ్యూస్ రాబడుతోంది.

మోగ్లీ ఓటీటీలో రికార్డుల మోత..
'బబుల్ గమ్' తర్వాత రోషన్ కనకాల చేసిన ప్రయత్నం 'మోగ్లీ'. థియేటర్లో ఆడియెన్స్ పట్టించుకోకపోయినా.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీనే అసలైన అడ్డా అని ఈ సినిమా మళ్ళీ నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రీమింగ్ మొదలైన కేవలం 6 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయికి చేరుకుంది. ఇది చిన్న సినిమాలకు చాలా పెద్ద రికార్డ్. థియేటర్లలో మిక్స్డ్ టాక్ వల్ల జనాలు వెళ్లలేదు కానీ ఓటీటీలో చూసిన వాళ్లు మాత్రం బాగుందని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రోషన్ నటన, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ అవుతున్నాయి.
విలన్ హైలైట్.. కథ ఏంటి?
ఈ మోగ్లీ సినిమాలో మెయిన్ విలన్ గా చేసిన బండి సరోజ్ కుమార్ నటనకు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, రోషన్ తో వచ్చే గొడవ సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కల ఉన్న ఒక యువకుడి కథ ఇది. ఒక మూగ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆ సామాన్య యువకుడు తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అనేదే స్టోరీ.
'కలర్ ఫోటో'తో నేషనల్ అవార్డు కొట్టిన సందీప్, రెండో సినిమా కోసం 5 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. రవితేజతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడంతో రోషన్ తో ఈ సినిమా తీశాడు. థియేటర్లో ఫ్లాప్ అయినా ఇప్పుడు ఓటీటీ రెస్పాన్స్ చూసి మేకర్స్ హ్యాపీగా ఉన్నారు.
మొదటి సినిమా 'బబుల్ గమ్', రెండో సినిమా 'మోగ్లీ' రెండూ బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా.. నటుడిగా మాత్రం రోషన్ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో.. వాళ్లు ఇప్పుడు ఈటీవీ విన్ లో ఈ సినిమాను చూసేయొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


