150 థియేటర్లలో ఎమోషనల్ థ్రిల్లర్ మిస్సింగ్ మేఘన- రెండేళ్ల ఫ్యూచర్ పెట్టి ఇలా వచ్చి అలా వెళ్లే సినిమా తీయలేదన్న డైరెక్టర్
Missing Meghana Release In 150 Theaters: తెలుగులో తెరకెక్కిన సరికొత్త సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, అంకిత్ కొయ్య నటించిన ఈ సినిమాను సుమారు 150 థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు వాచస్పతి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
Missing Meghana Release In 150 Theaters: టాలీవుడ్‌లో తెరకెక్కిన న్యూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.

పంచుమర్తి నరేష్ బాబు నిర్మాతగా
వీరితోపాటు మిస్సింగ్ మేఘన చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై మిస్సింగ్ మేఘన సినిమాను పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్నారు.
150 థియేటర్లలో మిస్సింగ్ మేఘన రిలీజ్
మిస్సింగ్ మేఘన సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహించారు. మిస్సింగ్ మేఘ చిత్రాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 18న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. సుమారు 150 థియేటర్స్‌లో మిస్సింగ్ మేఘన మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
మిస్సింగ్ మేఘన సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 పాటలకు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. డిజిటల్ మీడియాలో అయితే ఈ పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ అందించిన సంగీతం చాలా బావుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మిస్సింగ్ మేఘన టీజర్
అలాగే, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉందని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ గురించి ఎక్కువగా చెబుతున్నారు. పాటలతోపాటు మిస్సింగ్ మేఘన టీజర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
త్వరలోనే మిస్సింగ్ మేఘన సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ వాచస్పతి తెలిపారు. కంటెంట్ బాగా వచ్చిందని, ఇక బిజినెస్ పరంగా హ్యాపీ అని నిర్మాత నరేష్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, మిస్సింగ్ మేఘన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల జరిగింది.
డైరెక్టర్ వాచస్పతి కామెంట్స్
ఆ తరువాత సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల పాటను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే 2వ పాటను నిర్మాత అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఇక 3వ పాటను ప్రముఖ రైటర్, నిర్మాత కోన వెంకట్, మచ్చ రవి రిలీజ్ చేశారు.
"తెలుగులో ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికీ చాలా వచ్చాయి. ఇక తరువాత కూడా వస్తాయి. కానీ, మిస్సింగ్ మేఘన సినిమా మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది అని మాత్రం చెప్పగలను. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి మా 2 ఏళ్ల ఫ్యూచర్ పెట్టీ.. ఇలా వచ్చి అలా వెళ్లే సినిమా అయితే మేము చేయలేదు" అని డైరెక్టర్ వాచస్పతి అన్నారు.
క్లైమాక్స్‌కు షాక్ అవుతారు
"మిస్సింగ్ మేఘన సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే హుక్ పాయింట్‌కి అందరూ షాక్ అవుతారు. ఇది నార్మల్ థ్రిల్లర్ కాదు. ఇదో ఎమోషనల్ థ్రిల్లర్ " అని దర్శకుడు వాచస్పతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మీద తమకు నమ్మకం ఉందని, అందుకే ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


