తెలుగు ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానెల్స్ రేటింగ్స్ యుద్ధం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ విషయంలో స్టార్ మా, జీ తెలుగు టాప్ 10లో ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటాయి. తాజాగా 19వ వారానికి సంబంధించిన అర్బన్, రూరల్ (U+R) తో పాటు కేవలం అర్బన్ (U) మార్కెట్ టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈ వారం కూడా రెండు ప్రధాన వినోద చానళ్లు స్టార్ మా, జీ తెలుగు మధ్య గట్టి పోటీ నడిచింది.
టాప్ 10 తెలుగు సీరియల్స్ రేటింగ్స్

బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ 10 సీరియల్స్ ఏవో ఇక్కడ చూడండి. అర్బన్, రూరల్ (U+R) రేటింగ్స్ ఆధారంగా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన ఆ టాప్ సీరియల్స్ ఇవే.
కార్తీక దీపం 2 – స్టార్ మా
గత సీజన్ సృష్టించిన సంచలనాన్ని కార్తీక దీపం 2 కొనసాగిస్తోంది. ఈ వారం కూడా 11.08 అర్బన్, రూరల్ రేటింగ్ తోపాటు 9.08 అర్బన్ రేటింగ్‌తో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ నంబర్స్ నిరూపిస్తున్నాయి.
గుండెనిండా గుడిగంటలు – స్టార్ మా
చాలా స్వల్ప తేడాతో గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఫ్యామిలీ డ్రామాకు అర్బన్, రూరల్ మార్కెట్‌లో 10.52 రేటింగ్ రాగా, కేవలం అర్బన్ ఇళ్లలోనే ఏకంగా 10.29 రేటింగ్ రావడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో దీనికి విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు – స్టార్ మా
కుటుంబ సెంటిమెంట్లు, ఎమోషన్లతో సాగే ఈ సీరియల్ మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది అర్బన్, రూరల్ మార్కెట్‌లో 10.20 రేటింగ్, అర్బన్ మార్కెట్‌లో 8.62 రేటింగ్ నమోదు చేసింది.
ఇంటింటి రామాయణం – స్టార్ మా
నాలుగో స్థానంలో నిలిచిన ఇంటింటి రామాయణం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ అర్బన్, రూరల్ కేటగిరీలో 9.79 రేటింగ్, అర్బన్ కేటగిరీలో 8.42 రేటింగ్ సాధించింది.
పొదరిల్లు – స్టార్ మా
{{/usCountry}}నాలుగో స్థానంలో నిలిచిన ఇంటింటి రామాయణం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ అర్బన్, రూరల్ కేటగిరీలో 9.79 రేటింగ్, అర్బన్ కేటగిరీలో 8.42 రేటింగ్ సాధించింది.
పొదరిల్లు – స్టార్ మా
{{/usCountry}}స్టార్ మా వరుస విజయాల పరంపరలో ఐదో స్థానాన్ని పొదరిల్లు అందుకుంది. అర్బన్, రూరల్ మార్కెట్‌లో 8.41 రేటింగ్ తెచ్చుకున్న ఈ సీరియల్, అర్బన్ సెంటర్లలో ఏకంగా 9.47 రేటింగ్‌తో దూసుకెళ్లింది. దీన్ని బట్టి పట్టణాల్లో దీనికి తిరుగులేని పాపులారిటీ ఉందని తెలుస్తోంది.
నువ్వులేక నేనులేను – స్టార్ మా
టాప్ 6 స్థానాల వరకు స్టార్ మా హవానే నడిచింది. నువ్వులేక నేనులేను సీరియల్ 7.26 అర్బన్ ప్లస్ రూరల్ రేటింగ్, 6.21 అర్బన్ రేటింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది.
జయం – జీ తెలుగు
స్టార్ మా వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ జీ తెలుగు చానల్ 'జయం' సీరియల్‌తో టాప్ 7లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఏడో స్థానాన్ని దక్కించుకున్న ఈ సీరియల్ అర్బన్, రూరల్ మార్కెట్‌లో 6.49 రేటింగ్, అర్బన్ మార్కెట్‌లో 7.66 రేటింగ్ సాధించింది.
చామంతి – జీ తెలుగు
జయం సీరియల్ వెనువెంటనే జీ తెలుగుకు చెందిన మరో పాపులర్ సీరియల్ చామంతి నిలిచింది. ఇది 6.43 అర్బన్ ప్లస్ రూరల్ రేటింగ్, 7.52 అర్బన్ రేటింగ్‌తో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.
జగద్దాత్రి – జీ తెలుగు
తమదైన స్థిరమైన వీక్షకులను సంపాదించుకున్న జగద్ధాత్రి సీరియల్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సీరియల్ అర్బన్, రూరల్ కేటగిరీలో 6.27 రేటింగ్, అర్బన్ కేటగిరీలో 8.17 రేటింగ్ నమోదు చేయడం విశేషం.
బ్రహ్మముడి, పలుకే బంగారమాయెనా – స్టార్ మా
టాప్ 10 ముగింపులో స్టార్ మాకు చెందిన రెండు పాపులర్ సీరియల్స్ మధ్య గట్టి పోటీ జరిగి ఒకే రేటింగ్‌తో సరిపెట్టుకున్నాయి. బ్రహ్మముడి, పలుకే బంగారమాయెనా రెండు కూడా సరిగ్గా 5.15 అర్బన్ ప్లస్ రూరల్ రేటింగ్ సాధించాయి. అయితే అర్బన్ కేటగిరీలో చూస్తే పలుకే బంగారమాయెనా 4.83 రేటింగ్‌తో కాస్త ముందుండగా, బ్రహ్మముడి 4.48 రేటింగ్ సాధించింది.
స్టార్ మా తిరుగులేని ఆధిక్యం
19వ వారం డేటాను పరిశీలిస్తే తెలుగు డైలీ సీరియల్స్ రంగంలో స్టార్ మా తిరుగులేని లీడర్‌గా కనిపిస్తోంది. టాప్ 6 స్థానాలను వరుసగా కైవసం చేసుకోవడమే కాకుండా, ఓవరాల్ లీడర్‌బోర్డ్‌లోని 10 స్థానాల్లో 7 స్థానాలు ఆక్రమించింది. కార్తీకదీపం 2, గుండెనిండా గుడిగంటలు లాంటి ప్రధాన సీరియల్స్ అర్బన్, రూరల్ కేటగిరీలో రెండంకెల రేటింగ్స్ సాధిస్తూ చానల్ విజయానికి వెన్నుముకగా నిలిచాయి.