...
...
Next Story

Telugu Web Series: తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్.. అదరగొట్టిన శ్రీకాంత్

Telugu Web Series: జీ5 ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ స్ట్రీమింగ్ కు వస్తోంది. శ్రీకాంత్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను చిరంజీవి లాంచ్ చేయగా.. ఈ సిరీస్ జులై 31న స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jul 22, 2026, 19:55:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Telugu Web Series: మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ స్పేస్‌లో ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. జీ5 తెలుగు ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ అవైటెడ్ ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord) వెబ్ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను బాస్ చిరంజీవి స్వయంగా లాంచ్ చేసి టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు ఈ ట్రైలర్ చూస్తుంటే తనకు వకీల్ సాబ్, తాను నటించిన న్యాయం కావాలి సినిమాలు గుర్తొస్తున్నాయని అన్నారు. జులై 31 నుంచి ఈ లీగల్ థ్రిల్లర్ సిరీస్ జీ5 ప్లాట్‌ఫామ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

సత్యం, ధర్మం మధ్య బిగ్ ఫైట్

Telugu Web Series: తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్.. అదరగొట్టిన శ్రీకాంత్
Telugu Web Series: తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్.. అదరగొట్టిన శ్రీకాంత్

2 నిమిషాలకు పైగా ఉన్న ఈ అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సత్యం, ధర్మం మధ్య నడిచే యుద్ధంలో ఒక సామాన్యుడి గొంతు ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో ఈ ట్రైలర్‌లో కట్ చేశారు. "ప్రతి ఒక్కరి గొంతు వినబడాల్సిందే" అనే పవర్‌ఫుల్ మెసేజ్‌తో సాగే ఈ కథలో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, కోర్ట్‌రూమ్ వాదనల సీన్స్ మేజర్ హైలైట్‌గా నిలిచాయి.

ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ సినిమాలను, యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఈ సిరీస్ ట్రైలర్ బాస్ చేతుల మీదుగా బయటకు రావడంతో డిజిటల్ ఆడియన్స్‌లో 'అబ్జెక్షన్ మై లార్డ్' ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి.

శ్రీకాంత్ వర్సెస్ ముకేష్ రిషి

ఈ అబ్జెక్షన్ మై లార్డ్ ట్రైలర్ మొత్తం లాయర్లుగా నటించిన శ్రీకాంత్, ముకేష్ రిషి మధ్య కోర్టులో జరిగే ఇంటెన్స్ సీన్లతో సాగిపోయింది. కోర్టు ఆవరణలోనే ఓ వ్యక్తి ఆత్మాహుతి చేసుకోవడం, చాలా రోజులుగా ఎలాంటి కేసులేని పరశురామ్ (శ్రీకాంత్) ఆ కేసు టేకప్ చేయడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. ఆ తర్వాత పవర్ ఫుల్ లాయర్ అయిన ముకేష్ రిషితో కోర్టులో శ్రీకాంత్ ఇంటెన్స్ వాదనలు ట్రైలర్ ను రక్తి కట్టించాయి.

కోర్ట్‌రూమ్ థ్రిల్లర్స్‌కు పెరుగుతున్న క్రేజ్

న్యాయం కోసం నిలబడే ఒక లాయర్‌కు, ఆ వ్యవస్థను కంట్రోల్ చేసే పెద్దలకు మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఈ కథకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ప్రతి సీన్లో యాక్టర్స్ ఇచ్చిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌కు అసలైన అసెట్ అని చెప్పవచ్చు.

జులై 31న జీ5లో ఓటీటీ ప్రీమియర్

జీ5 తెలుగు సంస్థ వరుసగా వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ కంటెంట్‌తో సౌత్ డిజిటల్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకుంటోంది. ఆ సిరీస్ లైన్‌అప్‌లో 'అబ్జెక్షన్ మై లార్డ్' మరొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

జులై 31 నుంచి ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్న ఈ షో.. థ్రిల్లర్ జానర్ లవర్స్‌కు కచ్చితంగా బెస్ట్ వాచ్‌గా మారడం ఖాయం. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ లీగల్ డ్రామా డిజిటల్ స్పేస్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe