...
...
Next Story

Nandu Arrest: ఇలా కూడా ఉంటారా? రీల్ స్టార్స్ ను నమ్మొద్దు..పాపులర్ యూట్యూబర్ నందు అరెస్టుపై ట్రోల్స్ మోత..వీడియోలు వైరల్

Nandu Arrest Trolls: లండన్ ఉద్యోగాలు, వీసా ఎక్స్‌టెన్షన్ పేరిట లక్షలాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ నందనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం కలకలం రేపుతోంది. నమ్మించి మోసం చేస్తారా? అని నందుపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.

Published on: Sep 8, 2026, 06:15:41 IST
Advertisement

Nandu Arrest Trolls: పాపులర్ తెలుగు యూట్యూబర్ 'నందూస్ వరల్డ్' రామ నందనకు బిగ్ షాక్. ఆమెను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమెను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు.

నందుపై కేసు

ఇలా కూడా ఉంటారా? రీల్ స్టార్స్ ను నమ్మొద్దు..పాపులర్ యూట్యూబర్ నందు అరెస్టుపై ట్రోల్స్ మోత..వీడియోలు వైరల్
ఇలా కూడా ఉంటారా? రీల్ స్టార్స్ ను నమ్మొద్దు..పాపులర్ యూట్యూబర్ నందు అరెస్టుపై ట్రోల్స్ మోత..వీడియోలు వైరల్

నందూస్ వరల్డ్ ఛానెల్ తో బాగా పాపులర్ అయిన నందు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మోసం కేసు ఆధారంగా ఏపీ పోలీసులు జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (LOC) ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియోలు వైరల్ గా మారాయి.

​రూ.15 లక్షలు తీసుకుని

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా నందనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూకేలో నివసిస్తున్న మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఈ ఫిర్యాదు చేశారు. యూకే వీసా ఎక్స్‌టెన్షన్, ఉద్యోగ సహాయం, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ఇప్పిస్తామంటూ 'డెస్టనీ కన్సల్టెన్సీ'కి చెందిన బ్యాంక్ ఖాతాలకు పలు విడతలుగా మొత్తం రూ.15 లక్షలు బదిలీ చేయించుకున్నారని బాధితుడు పేర్కొన్నారు.

అయితే డబ్బు తీసుకున్న తర్వాత వీసా సేవలు అందించకపోగా, ఇచ్చిన స్పాన్సర్‌షిప్ పత్రాలు నకిలీవని తేలింది. బాధితుడు పదేపదే నిలదీయడంతో కేవలం రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎగ్గొట్టారని పోలీసుల వద్ద వాపోయారు.

​ఎఫ్‌ఐఆర్‌లో కుటుంబ సభ్యుల పేర్లు

ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో, శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నందనను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

ఖండించిన నందన

ఈ ఆరోపణలను నందన తీవ్రంగా ఖండించారు. తమకు లేదా తమ కుటుంబానికి ఎలాంటి కన్సల్టెన్సీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాల కారణంగా కొందరు కుట్రపూరితంగా తమ పేర్లను వాడుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఓ వీడియో స్టేట్‌మెంట్ విడుదల చేశారు. అంతేకాకుండా తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని నందన దంపతులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

మన శంకర వరప్రసాద్ గారులో

యూట్యూబ్‌లో 'నందూస్ వరల్డ్' ఛానల్ ద్వారా లైఫ్‌స్టైల్, ఫ్యామిలీ వీడియోలతో వీక్షకులకు రామ నందన బాగా దగ్గరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంలో నందన ఓ పాత్రలో మెరిశారు. ఒకవైపు సోషల్ మీడియాలో విశేష ఆదరణ ఉన్న ప్రముఖ యూట్యూబర్ ఇలా వీసా మోసం కేసులో చిక్కుకోవడం ఇటు సోషల్ మీడియాలో, అటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దారుణంగా ట్రోల్స్

నందనపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఎయిర్ పోర్టులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ‘ఇది ఒక బతుకేనా? ఇలా కూడా ఉంటారా?’, ‘రీల్ స్టార్స్ తో జాగ్రత్త’ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe