టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీతో పరాజయం చూశాడు. జాక్ తర్వాత మరో హిట్ కోసం సిద్ధు జొన్నలగడ్డ ప్రయత్నం చేసిన సినిమా తెలుసు కదా. ఈ సినిమాలో సిద్ధుకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు.
దర్శకురాలిగా నీరజ కోన

తెలుసు కదా సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన తెలుసు కదా సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాకు తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో ఇక్కడ చూద్దాం.
తెలుసు కదా నెట్ కలెక్షన్స్
తెలుసు కదా సినిమాకు ఇండియాలో రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లెక్కల ప్రకారం తెలుసు కదా సినిమాకు బాగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల వసూల్లు
తెలుసు కదా చిత్రానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు కోటి రూపాయల షేర్ కలెక్షన్స్ దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్ లెక్కలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున తెలుసు కదా సినిమాకు రూ. 1.25 రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేశారు.
జాక్ సినిమా తరహాలోనే
అయితే, సిద్ధు జొన్నలగడ్డ గత సినిమా జాక్‌కు సిమిలర్‌గానే తెలుసు కదా కలెక్షన్స్ ఉండే అవకాశం కనిపిస్తోందని సమాచారం. ఇకపోతే కర్ణాటక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్లో లిమిటెడ్ లొకేషన్స్‌లో తెలుసు కదా పర్వాలేదనిపిస్తోంది.
తెలుసు కదా వరల్డ్ వైడ్ కలెక్షన్స్
{{/usCountry}}అయితే, సిద్ధు జొన్నలగడ్డ గత సినిమా జాక్‌కు సిమిలర్‌గానే తెలుసు కదా కలెక్షన్స్ ఉండే అవకాశం కనిపిస్తోందని సమాచారం. ఇకపోతే కర్ణాటక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్లో లిమిటెడ్ లొకేషన్స్‌లో తెలుసు కదా పర్వాలేదనిపిస్తోంది.
తెలుసు కదా వరల్డ్ వైడ్ కలెక్షన్స్
{{/usCountry}}ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా తెలుసు కదా సినిమాకు రూ. 1.75 నుంచి 2 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ రూపంలో రానున్నాయని సమాచారం. అయితే, దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున 4 నుంచి 5 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఈ కలెక్షన్స్ చాలా తక్కువగా అనిపిస్తోంది.
తెలుసు కదా థియేటర్ ఆక్యుపెన్సీ
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డే రోజున ఉదయం షోలలో 23.52 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే, మధ్యాహ్నం షోలకు 24.75 శాతం, సాయంత్రం 24.42 శాతం, రాత్రి షోలకు 38.99 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.