...
...
Next Story

అదరగొడుతున్న అమర కావ్యం.. ధనుష్ సినిమా కలెక్షన్ల జోరు.. 20255లోనే బిగ్గెస్ట్.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ధనుష్, కృతి సనన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే'. తెలుగులో ఇది ‘అమర కావ్యం’ పేరుతో రిలీజైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. అయిదు రోజుల్లో ఎన్ని రూ.కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూద్దాం. ఇది 2025లో ధనుష్ అతిపెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.

Published on: Dec 3, 2025, 05:30:17 IST
Advertisement

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన 'తేరే ఇష్క్ మే' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. తెలుగులో ఇది ‘అమర కావ్యం’ పేరుతో రిలీజైంది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో దూకుడు కొనసాగిస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా ధనుష్ కు 2025లో బిగ్గెస్ట్ హిట్ గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తేరే ఇష్క్ మే కలెక్షన్లు

అమర కావ్యంలో కృతి సనన్, ధనుష్
అమర కావ్యంలో కృతి సనన్, ధనుష్

ధనుష్ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో అమర కావ్యంతో రిలీజైన ఈ మూవీ అయిదు రోజు (డిసెంబర్ 2) ఇండియాలో రూ.10.25 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ కలెక్షన్లు సాధించినట్లు ట్రేబ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ తెలిపింది. దీంతో అయిదు రోజుల కలెక్షన్లు రూ.71 కోట్లకు చేరాయి.

తమిళంలోనూ

తేరే ఇష్క్ మే మూవీ శుక్రవారం (నవంబర్ 28) రిలీజైంది. ఇది ఫస్ట్ డే రూ.18 కోట్లతో మంచి ఓపెనింగ్ సాధించింది. శనివారం రూ.17 కోట్లు, ఆదివారం రూ.19 కోట్లు వసూలు చేసింది. సోమవారం రూ.8.75 కోట్లకు తగ్గినా హిందీ వెర్షన్ బలంగా నిలవడంతో పాటు తమిళం నుంచి కూడా స్థిరమైన సహకారం లభించడంతో మంగళవారం మళ్లీ పుంజుకుంది.

ఆక్యుపెన్సీ నివేదిక

ప్రధాన నగరాల్లోని ఆక్యుపెన్సీ గణాంకాలు సూరత్‌లో 8% నుండి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో 28% వరకు మిశ్రమంగా ఉన్నాయి. మధ్యాహ్నం, సాయంత్రం షోలు మెరుగ్గా ఆకట్టుకున్నాయి. ఎన్సీఆర్ లో 38%కి చేరుకున్నాయి. రాత్రి షోలకు ఆక్యుపెన్సీ లేదని నివేదికలు తెలుపుతున్నాయి. షోల సంఖ్య చెన్నైలో కేవలం 56 నుండి ఎన్సీఆర్ లో 1,200 కంటే ఎక్కువ వరకు మారడం మెట్రో ప్రాంతాలలో బలమైన డిమాండ్‌ను హైలైట్ చేస్తుంది.

బిగ్గెస్ట్ హిట్

ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన 'తేరే ఇష్క్ మే' ఒక రొమాంటిక్ డ్రామా. ఇందులో ధనుష్, కృతి సనన్ జంటగా నటించారు. ఈ చిత్రం ఒక అల్లకల్లోలమైన ప్రేమకథను చెబుతుంది. ఎమోషనల్ గానూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది ఈ సినిమా. ఇందులో ధనుష్, కృతి సనన్ యాక్టింగ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks