...
...
Next Story

Thaai Kizhavi: ఓటీటీలోని బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమాకు 100 రోజులు.. డైరెక్టర్‌కు 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో

Thaai Kizhavi: ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ శివకుమార్ కు హీరో శివకార్తికేయన్ ఓ ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చాడు.

Published on: Jul 8, 2026, 17:30:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Thaai Kizhavi: కోలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ శివకార్తికేయన్ తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ లీడ్ రోల్ లో తనే స్వయంగా నిర్మించిన 'థాయ్ కిళవి' (Thaai Kizhavi) సినిమా సంచలన విజయం సాధించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ చిత్ర డెబ్యూ డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్‌కు రూ. 20 లక్షల విలువైన లగ్జరీ మహీంద్రా BE6 కార్ గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

Thaai Kizhavi: ఓటీటీలోని బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమాకు 100 రోజులు.. డైరెక్టర్‌కు 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
Thaai Kizhavi: ఓటీటీలోని బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమాకు 100 రోజులు.. డైరెక్టర్‌కు 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో

బుధవారం (జులై 8)నాడు శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ అఫీషియల్ పేజీలో ఈ కార్ డెలివరీకి సంబంధించిన ఎమోషనల్ వీడియో, ఫొటోస్ షేర్ చేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

డైరెక్టర్ కంటతడి.. థాయ్ కిళవి 100 రోజుల జాతర

ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చిన 'థాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోయింది. 100 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మూవీ టీమ్ అంతా కలిసి డైరెక్టర్ శివకుమార్‌ను ఈవెంట్ వెన్యూ వెలుపలికి తీసుకెళ్లారు. అక్కడ రిబ్బన్ కట్టి సిద్ధంగా ఉన్న సరికొత్త లగ్జరీ కార్ చూసి డైరెక్టర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

రాధికా శరత్‌కుమార్ స్వయంగా ఆ కార్ కవర్లను అన్‌కవర్ చేయగా, శివకుమార్ ఆనందంతో టీమ్ మొత్తాన్ని హగ్ చేసుకుని థాంక్స్ చెప్పారు. ఆ వెంటనే శివకార్తికేయన్‌తో కలిసి కొత్త కార్ లో చిన్న లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లారు.

శివకార్తికేయన్ గొప్పతనం

"ప్రతి మైల్‌స్టోన్‌కు ఒక స్పెషల్ సెలబ్రేషన్ అవసరం. మా ప్రియమైన డైరెక్టర్ విజన్, డెడికేషన్ వల్లే ఈ అద్భుతమైన జర్నీ సక్సెస్ అయింది" అంటూ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంటోంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే, వృద్ధాప్యంలో ఉన్న ఒక వడ్డీ వ్యాపారి పావనుథాయ్ (రాధికా శరత్‌కుమార్) చుట్టూ తిరుగుతుంది. గుర్తుపట్టలేనంత రా అండ్ రస్టిక్ మేకోవర్ లో రాధిక తన నటనతో ఊపిరి పోశారు. ఆమెకు ఆరోగ్యం క్షీణించి చనిపోయే స్టేజ్ కి వచ్చినప్పుడు, ఆమె ఎక్కడో బంగారం దాచిపెట్టిందని తెలుసుకున్న ముగ్గురు కొడుకులు ఆమెను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, వాటి చుట్టూ నడిచే బ్లాక్ కామెడీ ఆడియన్స్ ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. సింగంపులి, అరుల్‌దాస్, బాల శరవణన్, మునీష్‌కాంత్ ల కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా నిలిచింది.

ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, కేవలం ఇండియాలోనే రూ. 62.62 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 82.02 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ కల్ట్ కామెడీ డ్రామా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ఆడియన్స్ కు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది.

శివకార్తికేయన్, రాధిక అప్ కమింగ్ లైనప్

ప్రస్తుతం హీరో శివకార్తికేయన్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన 'మద్రాసి', ఈ సంక్రాంతికి సుధా కొంగర కాంబోలో వచ్చిన 'పరాశక్తి' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో, ఇదే డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్ డైరెక్షన్ లో 'సేయోన్' (Seyon) అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కూడా సూర్యతో కలిసి 'విశ్వనాథ్ అండ్ సన్స్', నయనతారతో కలిసి 'హై' (Hi) లాంటి క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe