ఇక మారరా? ఫ్యాన్స్ తోసేయడంతో కింద పడ్డ దళపతి విజయ్-వీడియోలు వైరల్-ఇదేం పద్ధతి అంటూ నెటిజన్లు ఫైర్
కొంతమంది పిచ్చి అభిమానులు తీరు మారడం లేదు.. అవును ఇప్పుడు నెటిజన్లు ఇలాగే అనుకుంటున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా సెలబ్రిటీలపైకి ఎగబడటం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఫ్యాన్స్ తోసేయడంతో దళపతి విజయ్ కిందపడ్డాడు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ సారి అభిమానుల అత్యుత్సాహానికి తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఇబ్బంది పడ్డాడు. చెన్నై ఎయిర్ పోర్టులో ఎగబడ్డ ఫ్యాన్స్ ధాటికి అతను కిందపడిపోయాడు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. విజయ్ తన రాజకీయ జీవితంపై దృష్టి పెట్టే ముందు జన నాయగన్ తన చివరి చిత్రం అని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

జన నాయగన్ ఆడియో లాంఛ్
తమిళ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’. తెలుగులో ఇది ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంఛ్ మలేషియాలో జరిగింది. ఈ గ్రాండ్ ఆడియో లాంచ్ కు హాజరైన విజయ్ ఆదివారం (డిసెంబర్ 29) రాత్రి చెన్నైకి తిరిగి వచ్చాడు. అయితే విమానాశ్రయంలో అభిమానులు ఎగబడటంతో కింద పడిపోయాడు.
వీడియోలు వైరల్
విజయ్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అక్కడ అతని కోసం వందలాది మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. విజయ్ రాగానే ఒక్కసారిగా పైకి ఎగబడిపోయారు. చుట్టూ సెక్యూరిటీ ఉన్నా విజయ్ ఆ ధాటికి కింద పడిపోయాడు. మళ్లీ లేచి తన కార్లోకి ఎక్కాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సెక్యూరిటీ ఏం చేస్తోంది?
200 మందిని కూడా సెక్యూరిటీ, పోలీసులు అడ్డుకోలేకపోయారని భద్రతా వైఫల్యంపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ లో విజయ్ రాజకీయ ర్యాలీలో జరిగిన విషాదాన్ని వారు ఉదహరించారు. దీని ఫలితంగా 41 మంది మరణించారు. ‘’దళపతి విజయ్ బాగానే ఉన్నాడు. కానీ మాకు కొంత తీవ్రమైన పౌర భావం, క్రౌడ్ మేనేజ్మెంట్ అవసరం’’ అని నెటిజన్ పేర్కొన్నాడు.
ప్లాన్ ఉండాలంటూ
“దళపతి అన్నా మీరు ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటం ఖాయం. కాబట్టి దయచేసి సరైన ప్లాన్, పూర్తి భద్రతా ఏర్పాట్లతో మాత్రమే ప్రయాణించండి’’ ఓ ఫ్యాన్ రాసుకొచ్చాడు. ”200 మంది మాత్రమే ఉన్నారు. కానీ కంట్రోల్ చేయలేకపోయారు. అయినప్పటికీ మీరు 40,000 మందికి పైగా హాజరైన కరూర్ ర్యాలీకి విజయ్ ను నిందించారు’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు. ఫ్యాన్స్ కు కనీసం సివిక్ సెన్స్ ఉండాలని కొంతమంది రియాక్టయ్యారు.
నిధి, సమంతకు
రాజా సాబ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ లోని లూలూ మాల్ కు వెళ్లిన హీరోయిన్ నిధి అగర్వాల్ పైకి ఫ్యాన్స్ ఎగబడటం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ సమంత కూడా ఓ ఈవెంట్ కోసం బయటకు వెళ్తే అభిమానులు పైకి దూసుకొచ్చారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












