...
...
Next Story

Vijay Family: ఇంట్లో వాళ్ల ఓట్లయినా పడతాయా అన్నారు-తమిళనాడు ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు-విజయ్ కు దూరంగా భార్య, కొడుకు

Vijay Family: విజేతలు ఊరికే కారు. ఎన్నో సవాళ్లను దాటాల్సి ఉంటుంది. మధ్యలో మనవాళ్లే దూరమవుతారు. అయినా పోరాటం ఆపక ముందుకు సాగితేనే వీరుడిగా నిలుస్తారు. దళపతి విజయ్ ఇప్పుడదే చేశాడు. ఫ్యామిలీ ఇబ్బందులను దాటి విజేతగా నిలబడ్డాడు. తమిళనాడు ప్రజలు అతణ్ని నెత్తిన పెట్టుకున్నారు.

Published on: May 5, 2026, 08:40:26 IST
Advertisement

Vijay Family: ప్రయాణం సాధారణంగానే మొదలవుతుంది.. కానీ విజయం దక్కిన తర్వాతే అది ప్రభంజనం అవుతుంది. ఇప్పుడా ప్రభంజనం పేరు దళపతి విజయ్. తమిళనాడు 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఫ్యామిలీ సవాళ్లు దాటి విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే ఈ విక్టరీ సాధ్యమైంది.

సొంతవాళ్లే దూరం

విజయ్ (PTI)
విజయ్ (PTI)

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ దళపతి విజయ్ కు ఇంట్లోనే తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. తండ్రి, భార్య, కొడుకు తో విభేధాలు వచ్చాయి. పార్టీ పెట్టే సమయంలోనే తండ్రి చంద్రశేఖర్ వ్యతిరేకించాడు. కొడుకు పెట్టే పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓపెన్ గానే మాట్లాడాడు. ఇప్పుడేమో కొడుకు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

భార్య విడాకులు

టీవీకే పార్టీ స్థాపించి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వేళ దళపతి విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని అతని భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. విజయ్ కు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ పరిణామం విజయ్ పై బాంబ్ లా పడింది.

కొడుకు కూడా

విజయ్, సంగీత విడాకుల విషయం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సమయంలోనే కొడుకు జేసన్ సంజయ్ కూడా తండ్రికి దూరమయ్యాడు. తల్లి సంగీతకు సపోర్ట్ గా నిలిచిన అతను.. సోషల్ మీడియాలో విజయ్ ను అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది.

త్రిషతో సంబంధం

తండ్రితో విభేధాలు, విడాకుల కోరుతూ భార్య, కొడుకు దూరం, త్రిషతో రిలేషన్ షిప్ పుకార్లు.. ఇలా దళపతి విజయ్ ను ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ చుట్టుముట్టాయి. ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు గుప్పించేందుకు ఇవే ఆయుధాలుగా మారాయి. దీంతో విజయ్ కు ఇంట్లో వాళ్ల ఓట్లయినా పడతాయా? అని ప్రత్యర్థి పార్టీల నేతలు ఎద్దేవా చేశారు.

జనాల ప్రేమ

సొంతవాళ్లు దూరమైనా, తీవ్రమైన విమర్శలు వచ్చినా విజయ్ ను తమిళనాడు జనాలు నెత్తిన పెట్టుకున్నారు. తమ అభిమాన హీరోపై అమితమైన ప్రేమ కురిపించారు. మరోవైపు విజయ్ కూడా ఏ మాత్రం కుంగిపోకుండా వీరుడిలా పోరాడాడు. ఎన్నికల క్షేత్రంలో అలుపెరగని యుద్ధం చేశాడు. చివరకు జనాల మద్దతుతో అద్భుత విజయం సాధించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe