కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. జన నాయగన్ లీక్ పై హీరోయిన్ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది.
జన నాయగన్ లీక్

సెన్సార్ వివాదంతో జన నాయగన్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఈ ఘటనపై తన ఆవేదనను, నిరాశను వ్యక్తం చేసింది.
పూజా హెగ్డే స్టోరీ
శనివారం (ఏప్రిల్ 11) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూజా హెగ్డే స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ పంచుకుంది. "నా ప్రియమైన ప్రేక్షకులారా.. ఒక సినిమా అనేది లెక్కలేనన్ని గంటల శ్రమ, సృజనాత్మకమైన రిస్క్, వ్యక్తిగత త్యాగాల ఫలితం. మీకు అత్యుత్తమ అనుభూతిని అందించాలని ప్రతిరోజూ కష్టపడే ఒక భారీ టీమ్ కృషి ఇందులో ఉంది. మా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం నాకు మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో బాధ కలిగిస్తోంది" అని పూజా హెగ్డే బాధపడింది.
మన బాధ్యత
"ఇలా చట్టవిరుద్ధంగా సినిమా లీక్ అవ్వడం కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా, ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు ఆశించే కనీస గౌరవాన్ని దెబ్బతీస్తోంది. విజయ్ సార్ చివరి సినిమాను అందరం కలిసి థియేటర్లలో పెద్ద తెరపై చూసి సెలబ్రేట్ చేసుకోవడం మన బాధ్యత కదా? కాబట్టి దయచేసి సినిమాను సరైన మార్గంలోనే చూడండి. కాస్త వేచి ఉండండి, అది సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ప్రోత్సహించకండి. అప్పుడే సినిమా, కళ బతుకుతాయి," అని పూజా హెగ్డే తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
{{/usCountry}}"ఇలా చట్టవిరుద్ధంగా సినిమా లీక్ అవ్వడం కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా, ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు ఆశించే కనీస గౌరవాన్ని దెబ్బతీస్తోంది. విజయ్ సార్ చివరి సినిమాను అందరం కలిసి థియేటర్లలో పెద్ద తెరపై చూసి సెలబ్రేట్ చేసుకోవడం మన బాధ్యత కదా? కాబట్టి దయచేసి సినిమాను సరైన మార్గంలోనే చూడండి. కాస్త వేచి ఉండండి, అది సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ప్రోత్సహించకండి. అప్పుడే సినిమా, కళ బతుకుతాయి," అని పూజా హెగ్డే తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
{{/usCountry}}సెన్సార్ చిక్కులు
నిజానికి 'జన నాయగన్' సినిమాను జనవరిలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో విడుదల వాయిదా పడింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదల నిలిచిపోయింది.
సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో సినిమా లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వనటుడు కమల్ హాసన్ సైతం ఇది "కళపై జరిగిన దాడి" అని అభివర్ణించారు.
రాజకీయ ప్రకంపనలు
హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'జన నాయగన్' ఒక పక్కా పొలిటికల్ డ్రామా. దళపతి విజయ్ తన సొంత పార్టీ 'తమిళ వెట్రి కజగం' (TVK) ద్వారా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు నటించిన చివరి సినిమా ఇదే. ఇందులో పూజా హెగ్డేతో పాటు బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.
ఇది విజయ్‌కు 69వ సినిమా కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విజయ్, తన రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిడి వల్లే సినిమా విడుదలలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.