తమిళ సూపర్ స్టార్, తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 27 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న విజయ్ - సంగీత దంపతులు విడిపోతున్నారనే వార్త కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత స్వర్ణలింగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అక్రమ సంబంధం ఆరోపణలే కారణమా?

సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. దళపతి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. 2021లోనే తనకు ఈ విషయం తెలిసిందని, ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ, అది కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. సదరు నటి విజయ్‌తో కలిసి విదేశీ పర్యటనలు చేయడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి తనను, తన పిల్లలను తీవ్ర అవమానానికి గురిచేశాయని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.
మానసిక క్షోభ.. ఆర్థిక ఆంక్షలు
కేవలం అక్రమ సంబంధం మాత్రమే కాకుండా విజయ్ తనపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించారని, తన స్వేచ్ఛను హరించారని సంగీత పిటిషన్‌లో పేర్కొన్నారు.
"మా వివాహ బంధం ప్రస్తుతం కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది. దీనిని మళ్లీ పునరుద్ధరించడం అసాధ్యం. ఈ బంధం నాకు మానసిక వేదనను, అవమానాన్ని తప్ప మరేమీ మిగల్చలేదు" అని ఆమె పేర్కొన్నారు.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, 1954లోని సెక్షన్ 27(1)(a), 27(1)(d) ప్రకారం వ్యభిచారం (Adultery), వేధింపుల (Cruelty) ప్రాతిపదికన ఆమె ఈ విడాకుల పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది.
అభిమానిగా మొదలై.. భార్యగా మారి..
తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె అయిన సంగీత.. ఒకప్పుడు విజయ్‌కి వీరాభిమాని. 1999 ఆగస్టు 25న వీరి వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కీలక సమయంలో ఈ విడాకుల వ్యవహారం బయటకు రావడం గమనార్హం.
{{/usCountry}}తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె అయిన సంగీత.. ఒకప్పుడు విజయ్‌కి వీరాభిమాని. 1999 ఆగస్టు 25న వీరి వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కీలక సమయంలో ఈ విడాకుల వ్యవహారం బయటకు రావడం గమనార్హం.
{{/usCountry}}నిజానికి తమిళనాడు ఎన్నికలు, సొంత పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లే ముందు విజయ్ కు ఏదీ కలిసి రావడం లేదు. అతని ర్యాలీల్లో తొక్కిసలాటలు జరిగి అభిమానులు చనిపోవడం, చివరి సినిమా జన నాయగన్ ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోకపోవడం, తాజాగా భార్య ఇచ్చిన విడాకుల షాక్ తో విజయ్ సతమతమవుతున్నాడు. మరి ఈ అడ్డంకులు అతడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.