దీపావళి సందర్భంగా అభిమానులకు మరో హారర్ కామెడీ మూవీ థామాతో బహుమతి ఇచ్చింది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా జంటగా నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్-కామెడీ చిత్రం థామా.
మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి

భారీ అంచనాల మధ్య అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది థామా. మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి ఐదో చిత్రంగా వచ్చిన థామా థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో థామా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
థామా తొలి రోజు కలెక్షన్స్
థామా మూవీ ఇండియాలో తొలి రోజున రూ. 24.87 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపినట్లు బాలీవుడ్ మీడియా సైట్స్ పేర్కొన్నాయి. అయితే, ఈ దివాళికి బాలీవుడ్ నుంచి రష్మిక మందన్నా థామా సినిమాకు పెద్దగా బాక్సాఫీస్ పోటీ లేదు.
థామాకు లేని బాక్సాఫీస్ పోటీ
ఈ పండుగ సందర్భంగా థామాతోపాటు ఒకే ఒక్క సినిమా ఏక్ దీవానే కి దీవానియత్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో థామాకు పెద్ద పోటీ లేకుండా పోయింది. కానీ, ఇదే మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి చివరిగా వచ్చిన మరో హారర్ కామెడీ సినిమా స్త్రీ 2 కంటే థామా కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి.
స్త్రీ 2 కలెక్షన్స్
గతేడాది ఇదే యూనివర్స్ నుంచి శ్రద్ధా కపూర్ స్త్రీ 2 సినిమా ఓపెనింగ్ రోజున రూ. 35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక గత దీపావళికి విడుదలైన మరో హారర్ కామెడీ జోనర్ మూవీ భూల్ భులయ్యా 3 మూవీ కంటే కూడా థామా బాక్సాఫీస్ వసూల్లు తక్కువగా ఉన్నాయి.
భూల్ భులయ్యా 3 వసూళ్లు
కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి దిమ్రి, మాధురి దీక్షిత్, రాజ్‌పాల్ యాదవ్ వంటి పాపులర్ నటీనటులు యాక్ట్ చేసిన భూల్ భులయ్యా 3 మూవీ తొలి రోజున ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 32 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
థామా థియేటర్ ఆక్యుపెన్సీ
{{/usCountry}}కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి దిమ్రి, మాధురి దీక్షిత్, రాజ్‌పాల్ యాదవ్ వంటి పాపులర్ నటీనటులు యాక్ట్ చేసిన భూల్ భులయ్యా 3 మూవీ తొలి రోజున ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 32 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
థామా థియేటర్ ఆక్యుపెన్సీ
{{/usCountry}}హారర్ కామెడీగా వచ్చిన థామా అదే జోనర్ సినిమాలైన స్త్రీ 2, భూల్ భులయ్యా 3 వంటి రెండింటి కంటే తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే తొలి రోజున (అక్టోబర్ 21) హిందీలో థామాకు ఓవరాల్‌గా 34.50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
ఇప్పటికీ నాలుగు సినిమాలు
దీనిలో ఉదయం షోలకు 15.76 శాతం, మధ్యాహ్నాం 39.81 శాతం, సాయంత్రం 42.91 శాతం, రాత్రి షోలకు 39.50 శాతంగా థామా థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. ఇదిలా ఉంటే, థామా సినిమాకు ఆదత్య సర్పతోత్దార్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో ఇప్పటికి స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 సినిమాలు వచ్చాయి.