...
...
Next Story

ఈ వారం ఓటీటీలో రష్మిక మందన్న రెండు సినిమాలు- ఒకటేమో హారర్ థ్రిల్లర్- మరొకటి రొమాంటిక్ డ్రామా- ఓ లుక్కేయండి

ఈ వారం ఓటీటీలో రష్మిక మందన్న సందడి నెలకొంది. ఆమె హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఒకటి హారర్ థ్రిల్లర్ కాగా మరొకటి రొమాంటిక్ డ్రామా.

Published on: Dec 5, 2025, 13:49:06 IST
Advertisement

2025 సంవత్సరం రష్మిక మందన్నాదే. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఛావా, సికందర్, కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో అదరగొట్టింది రష్మిక. ఈ వారం నేషనల్ క్రష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవే థామా, ది గర్ల్ ఫ్రెండ్. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.

థామా ఓటీటీ

ఓటీటీలో రష్మిక మందన్న సినిమాలు (x)
ఓటీటీలో రష్మిక మందన్న సినిమాలు (x)

రష్మిక మందన్న నటించిన ఫస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘థామా’. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. బాలీవుడ్ లో ఈ హారర్ థ్రిల్లర్ తో అదరగొట్టింది రష్మిక మందన్న. ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో రష్మిక బేతాళి పిశాచిగా నటించింది. తన గ్లామర్ తోనూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 2 నుంచి థామా ఓటీటీలో ఉంది.

థామా స్టోరీ

థామా సినిమాలో రష్మిక మందన్న తడ్కా అనే బేతాళి రాక్షసిగా నటించింది. మనుషుల రక్తాన్ని తాగే పిశాచి జాతికి చెందిన యువతిగా ఆమె తన నటనతో మెప్పించింది. ఒకసారి జర్నలిస్ట్ అయిన హీరో న్యూస్ కవరేజీ కోసం పర్వత ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అతనిపై ఎలుగు బంటి దాడి చేస్తోంది. దాని నుంచి తడ్కా ఆమెను కాపాడుతుంది. ఆ తర్వాత హీరో కూడా బేతాళుడిగా మారతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? చివరికి థామా ఎవరు? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో భూమా దేవి క్యారెక్టర్ ప్లే చేసింది రష్మిక మందన్న. సిటీలో కాలేజీ చదువు కోసం వస్తుంది భూమా. అక్కడ హీరోను లవ్ చేస్తుంది. కానీ అది నిజమైన ప్రేమ అవునా? కాదా? అనే సందిగ్ధంలో పడిపోతుంది. ఆ టాక్సిక్ రిలేషన్ షిప్ నుంచి బయటపడలేక సతమతమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks