...
...
Next Story

ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. జంటలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన తరుణ్, ఈషా మూవీ మేకర్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: మూవీ మేకర్స్ జంటలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ అనౌన్స్ చేయడం విశేషం. అంతేకాదు ఇంతకు ముందు కూడా టికెట్ రూ.99 అంటూ ఓ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Published on: Jan 28, 2026, 21:15:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సినిమా టికెట్ల మరీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్న ఈ రోజుల్లో ఓం శాంతి శాంతి శాంతి: మూవీ మేకర్స్ మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టికెట్ కేవలం రూ.99 మాత్రమే అని అనౌన్స్ చేయగా.. ఇప్పుడు జంటలకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వడం విశేషం.

కపుల్స్ టికెట్ ఆఫర్

ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. జంటలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన తరుణ్, ఈషా మూవీ మేకర్స్
ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. జంటలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన తరుణ్, ఈషా మూవీ మేకర్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన మూవీ ఓం శాంతి శాంతి శాంతి: . ఈ సినిమా ఈ శుక్రవారం అంటే జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందే అంటే జనవరి 29న పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ షోలు పడే థియేటర్ల లిస్టు రిలీజ్ చేస్తూ వాటిలో ఈ ఆఫర్ అనౌన్స్ చేశారు.

అగనంపూడిలోని ఏషియన్ ముక్తా, అమలాపురంలోని వీపీసీ ఎస్సీ 2, మచిలీపట్నంలోని మినీ రేవతి, అనంతపురంలోని గౌతమి థియేటర్లలో ఈ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారు. వీటిలో జంటగా వెళ్తే ఒకటి టికెట్ కు మరో టికెట్ ఫ్రీగా ఇస్తారు. ఇక తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు వేసే థియేటర్ల లిస్టును కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

అతి తక్కువ ధరకే టికెట్లు

నిజానికి ఈ మధ్యే తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా రిలీజైనా సాధారణ టికెట్ పైన మళ్లీ రేట్లు భారీగా పెంచేస్తున్నారు. హీరో, బడ్జెట్ ను బట్టి టికెట్ పై రూ.50 నుంచి రూ.100 వరకు పెంచుతున్నారు. కానీ ఓం శాంతి శాంతి శాంతి: మూవీ మాత్రం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను కేవలం రూ.99గా నిర్ణయించడం విశేషం. ఇక మల్టీప్లెక్స్ లలో అయితే రూ.150 మాత్రమే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ టికెట్ల ధరలు ఎంతో హాయినిచ్చేదే.

ఓం శాంతి శాంతి శాంతి: మూవీ విశేషాలు

భార్యపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించి ఆమె చేతుల్లోనే తన్నులు తినే భర్త చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇన్నాళ్లూ తెలంగాణ యాసలో అదరగొట్టిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో గోదావరి యాసలో తొలిసారి అలరించబోతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks