...
...
Next Story

Gayapadda Simham: ట్రంప్ కు ఇరానీ టీ తాగించిన తరుణ్ భాస్కర్..గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్స్ వేరే లెవల్.. యూఎస్ ప్రీమియర్

Gayapadda Simham: గాయపడ్డ సింహం అంటూ థియేటర్లలో ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు తరుణ్ భాస్కర్ వచ్చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తరుణ్ భాస్కర్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఏఐ యూజ్ చేసి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ఉన్నట్లు క్రియేట్ చేస్తున్న వీడియోలు వైలర్ గా మారుతున్నాయి.

Published on: Apr 22, 2026, 05:49:18 IST
Advertisement

Gayapadda Simham: తన అప్ కమింగ్ మూవీ ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లతో డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్ మరోసారి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఏఐతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీడియోలు క్రియేట్ చేసి గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను తరుణ్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. తాజాగా ట్రంప్ తో ఇరానీ చాయ్ తాగించాడు తరుణ్ భాస్కర్.

వీడియో వైరల్

ఏఐ వీడియోలో ట్రంప్ తో తరుణ్ భాస్కర్ (x)
ఏఐ వీడియోలో ట్రంప్ తో తరుణ్ భాస్కర్ (x)

గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రచారాన్ని అతను డిఫరెంట్ గా నిర్వహిస్తున్నాడు. తాజాగా ట్రంప్ తో కలిసి తరుణ్ టీ తాగుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది. ఇందులో ట్రంప్, ఇరానీ టీ జోక్ పేలింది.

ఇరానీ టీ

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి యుద్ధం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తరుణ్ భాస్కర్ తన గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడు. ట్రంప్ పక్కన కూర్చుని టీ తాగుతున్నట్లు ఏఐ వీడియో క్రియేట్ చేశారు. టీ ఎలా ఉంది? అని ట్రంప్ ను తరుణ్ అడుగుతాడు. టీ బాగుందని, ఇండియా టీ ఎప్పుడూ బాగుంటుందని ట్రంప్ చెప్తాడ.

అది ఇరానీ టీ అని తరుణ్ అనగానే ట్రంప్ ఆ టీని ఉమ్మేస్తాడు. అందుకే నిన్ను అమెరికా నుంచి బయటకు పంపించేశానని ట్రంప్ అనడం, రివేంజ్ తీర్చుకున్నట్లు తరుణ్ ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి.

ప్రీమియర్ డేట్

గాయపడ్డ సింహం మూవీ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇందులో తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ డైరెక్టర్. గాయపడ్డ సింహం సినిమా మే 1న రిలీజ్ కానుంది.

అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడి కథతో గాయపడ్డ సింహం మూవీ తెరకెక్కింది. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడి నుంచి అందరినీ తిరిగి పంపించేస్తాడు. అప్పుడు గాయపడ్డ సింహంలా మారిన ఆ యువకుడు ఏం చేశాడన్నదే ఈ గాయపడ్డ సింహం మూవీ స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks