...
...
Next Story

OTT Horror: ఓటీటీలో వణికిస్తున్న హారర్ థ్రిల్లర్.. 4500 కోట్ల బ్లాక్ బస్టర్.. మీరు చూశారా?

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఓ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.4500 కోట్ల వసూళ్లు ఖాతాలో వేసుకుంది.

Published on: Feb 15, 2026, 20:43:57 IST
Advertisement

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ పాపులర్ ఫ్రాంఛైజీ ‘ది కంజురింగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను భయపెట్టాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో చివరి సినిమాగా భావిస్తున్న ‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’ కూడా థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ వణికిస్తోంది.

ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ

The Conjuring Last Rites OTT Release: Horror franchise finale begins streaming in India — here’s where to watch.
The Conjuring Last Rites OTT Release: Horror franchise finale begins streaming in India — here’s where to watch.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో సాగే ఈ సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియన్స్ మన భాషలోనూ ఈ కంజురింగ్ లాస్ట్ రైట్స్ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

4500 కోట్లు

సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ.. ది కంజురింగ్ ఫ్రాంఛైజీలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.4500 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. రూ.490 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ ఏకంగా రూ.4500 కోట్లు సంపాదించడం విశేషం.

అయిదు నెలల తర్వాత

థియేటర్లో రిలీజైన అయిదు నెలల తర్వాత ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. ఫిబ్రవరి 13, 2026 నుంచి ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మైఖేల్ చావేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అసలైన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్, లొరైన్ వారెన్‌లుగా పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా మళ్లీ నటించారు. యాక్టింగ్ తో అదరగొట్టారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks