...
...
Next Story

The Family Man Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 ఎప్పుడు? మనోజ్, ప్రియమణి సిరీస్ స్టోరీ ఏంటంటే?

The Family Man Season 4: ఓటీటీ చరిత్రలోనే ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' నుంచి నాలుగో సీజన్ పనులు వేగవంతమయ్యాయి. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే సీజన్ 4 స్క్రీన్‌ప్లే పనుల్లో ఉన్నారని, శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అధికారిక సమాచారం.

Published on: Nov 2, 2026, 21:11:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

The Family Man Season 4: ఇండియన్ ఓటీటీ స్పేస్ లో మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (T.A.S.C.) సీక్రెట్ ఏజెంట్‌గా దేశాన్ని కాపాడుతూనే, మరోవైపు సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా సంసారాన్ని ఈదే 'శ్రీకాంత్ తివారీ' పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పాయ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

The Family Man Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 ఎప్పుడు? మనోజ్, ప్రియమణి సిరీస్ స్టోరీ ఏంటంటే?
The Family Man Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 ఎప్పుడు? మనోజ్, ప్రియమణి సిరీస్ స్టోరీ ఏంటంటే?

గతేడాది నవంబర్ 21న విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ 7 ఎపిసోడ్ల పాటు ఉత్కంఠభరితంగా సాగి, ముగింపులో ఊహించని క్లైమ్యాక్స్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను తీవ్ర సస్పెన్స్‌లో ముంచెత్తింది. దాంతో 'సీజన్ 4' (The Family Man Season 4) ఎప్పుడు రాబోతోంది? కథ ఎటు మలుపు తిరగనుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తాయి. సీజన్ 3 ముగింపులో జీప్ ప్రమాదానికి గురై కుప్పకూలిన శ్రీకాంత్ తివారీ ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అనే ఉత్కంఠకు సీజన్ 4 సమాధానం ఇవ్వనుంది.

రాజ్ అండ్ డీకే స్క్రిప్ట్ వర్క్: ఒకే పెద్ద కథలో రెండో భాగం

ఈ క్రమంలో దిగ్గజ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4' డెవలప్ చేసే పనుల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజ్ మాట్లాడుతూ: "మేము సీజన్ 3, సీజన్ 4 లను ఒకే పెద్ద కథలోని రెండు భాగాలుగా ప్లాన్ చేశాం. సీజన్ 3 లో ప్రధాన రాజకీయ కోణానికి ముగింపు ఇచ్చినా, శ్రీకాంత్ తివారీ వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాన్ని కావాలనే మధ్యలోనే వదిలేశాం. ప్రస్తుతం ఆ కథాంశానికి సంబంధించిన రెండో భాగాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాం" అని ప్రకటించారు.

సీజన్ 3 కథాంశం ఈశాన్య భారతదేశంలో 'ప్రాజెక్ట్ సహకార్' అనే శాంతి ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేసే అంతర్జాతీయ కుట్ర చుట్టూ తిరిగింది. రుక్మాగా జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat), మీరాగా నిమ్రత్ కౌర్ (Nimrat Kaur) పవర్‌ఫుల్ విలన్లుగా అలరించారు. మయాన్మార్ సరిహద్దుల్లో భారతీయ సైనికులను కాపాడే క్రమంలో శ్రీకాంత్ తివారీ తీవ్రంగా గాయపడటం, తప్పించుకునే క్రమంలో ఆయన జీప్ చెట్టును బలంగా ఢీకొట్టడం క్లైమ్యాక్స్ లో చూపించారు.

జీప్ నుంచి బయటకు వచ్చి కుప్పకూలిపోయిన శ్రీకాంత్ తివారీ బతికాడా లేదా అనే సస్పెన్స్‌తో సీజన్ 3 ముగిసింది. అంతేకాకుండా విలన్ రుక్మా తప్పించుకోవడం, మీరా అంతర్జాతీయ ఆయుధాల కుట్ర ఇంకా ముగియకపోవడం సీజన్ 4 కి ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్‌గా మారనున్నాయి.

సీజన్ 4 నటీనటులు, ఇతర విశేషాలు

నాలుగో సీజన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ (శ్రీకాంత్ తివారీ)తో పాటు ఆయన భార్య సుచిత్రగా ప్రియమణి (Priyamani), ప్రాణస్నేహితుడు జేకే తల్పడేగా షరీబ్ హష్మీ (Sharib Hashmi) తిరుగులేని రీతిలో అలరించనున్నారు. పిల్లలుగా ధృతి (ఆశ్లేషా ఠాకూర్), అధర్వ (వేదాంత్ సిన్హా)లతో పాటు జోయాగా శ్రేయా ధన్వంతరి తిరిగి రానున్నారు.

అంతేకాకుండా రాజ్ అండ్ డీకే వారి 'ఫర్జీ' (Farzi) యూనివర్స్ నుంచి విజయ్ సేతుపతి (మైఖేల్ వేదనాయగం) క్యారెక్టర్ సీజన్ 3లో మెరిసినట్లే, సీజన్ 4లోనూ స్పెషల్ క్యామియోలు ఉండే అవకాశం ఉంది. మరి శ్రీకాంత్ తివారీ ఈ గండం నుంచి బయటపడి దేశాన్ని ఎలా కాపాడతాడో చూడాలంటే సీజన్ 4 దాకా వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks