Family Man 4: ఓటీటీని షేక్ చేసిన స్పై థ్రిల్లర్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి కొత్త సీజన్ రాబోతుంది. ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ నవంబర్ 21, 2025న విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క్లైమాక్స్ లో సస్పెన్స్ తో తర్వాతి సీజన్ పై మేకర్స్ అంచనాలు పెంచేశారు.
ఫ్యామిలీ మ్యాన్ 4 ఓటీటీ

రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సీజన్లు వచ్చాయి. ఇక నాలుగో సీజన్ కోసం కూడా మేకర్స్ రంగంలోకి దిగారు. ఇప్పటికే స్క్రిప్ట్ రైటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం.
రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు?
ఓటీటీ బ్లాక్ బస్టర్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ నుంచి సీజన్ 4 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ 4 రావడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.
గత సీజన్ల మధ్య ఉన్న విరామాన్ని గమనిస్తే, 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో ఈ సిరీస్ కొత్త సీజన్ వచ్చే అవకాశం ఉంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది.
మనోజ్ బాజ్‌పాయ్ ఏమన్నాడంటే?
గతంలో ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన మనోజ్ బాజ్‌పాయ్.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4 గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. క్లైమాక్స్ విషయంలో అయోమయంలో ఉన్న ఒక నెటిజన్‌కు సమాధానమిస్తూ, "మీ ప్రశ్నలన్నింటికీ నాలుగో సీజన్‌లో సమాధానం దొరుకుతుంది.. త్వరలోనే కలుద్దాం!" అని పేర్కొన్నాడు.
మరో నెటిజన్‌తో సరదాగా మాట్లాడుతూ.. "ఇక అంతా నాలుగో సీజన్లోనే.. ఇక అక్కడ యాక్షన్ మామూలుగా ఉండదు" అని హింట్ ఇచ్చాడు. దీనిని బట్టి సీజన్ 4 పనులు ఎప్పుడో మొదలయ్యాయని స్పష్టమవుతోంది.
సీజన్ 3 గురించి
{{/usCountry}}మరో నెటిజన్‌తో సరదాగా మాట్లాడుతూ.. "ఇక అంతా నాలుగో సీజన్లోనే.. ఇక అక్కడ యాక్షన్ మామూలుగా ఉండదు" అని హింట్ ఇచ్చాడు. దీనిని బట్టి సీజన్ 4 పనులు ఎప్పుడో మొదలయ్యాయని స్పష్టమవుతోంది.
సీజన్ 3 గురించి
{{/usCountry}}ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో ఈశాన్య భారత దేశ నేపథ్యంలో సాగిన కథలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ వంటి నటుల చేరికతో ఈ సీజన్ మరింత రక్తికట్టింది. అయితే, మూడో సీజన్ ముగింపులో అనేక ప్రశ్నలు, సస్పెన్స్‌ను మిగిల్చడంతో అభిమానుల్లో తదుపరి సీజన్ గురించి ఆసక్తి పెరిగింది.
సోషల్ మీడియాలో
ముఖ్యంగా సోషల్ మీడియాలో సీజన్ 4 ఎప్పుడు వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. క్లైమాక్స్‌లో కొన్ని చిక్కుముడులు విప్పకపోవడంతో, కథ ఇక్కడితో ముగిసిపోలేదని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4 ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది.