దసరా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి. దసరా తర్వాత దీక్షిత్ శెట్టి నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో గర్ల్‌ఫ్రెండ్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాయ్‌ఫ్రెండ్‌గా అంటే హీరోగా దీక్షిత్ శెట్టి పర్ఫామెన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.
రెండు తేదీల్లో రిలీజ్

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు, హిందీలో నవంబర్ 7న.. తమిళం, మలయాళం, కన్నడలో నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరో దీక్షిత్ శెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
మరో హీరోయిన్ చేయలేదేమో
-రష్మిక మందన్నా పర్‌ఫార్మెన్స్ చూశాక "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమాకు మరో హీరోయిన్ న్యాయం చేయలేదేమో అనిపించింది. తను అంత బాగా పర్‌ఫార్మ్ చేసింది. మీరు మూవీ చూస్తున్నంత సేపు రష్మిక కనిపించదు, భూమా అనే పాత్రనే కనిపిస్తుంది.
స్టార్ హీరోయిన్‌తో ఉన్నామనే
-మా సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే యానిమల్ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. రష్మికతో కలిసి నటిస్తున్నప్పుడు ఒక స్టార్ హీరోయిన్‌తో ఉన్నామనే ఫీలింగ్ కలగలేదు. తను చాలా ఫ్రెండ్లీగా యూనిట్ అందరితో ఉండేది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా
-ఈ సినిమా యూత్ కోసమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే మంచి క్యారెక్టర్స్ మా మూవీలో ఉన్నాయి. టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సినిమాల్లో ఇలాంటివే చూస్తుంటాం. కానీ టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ఎలిమెంట్ మా మూవీలో చూస్తారు.
మంచి రైటర్, డైరెక్టర్
{{/usCountry}}-ఈ సినిమా యూత్ కోసమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే మంచి క్యారెక్టర్స్ మా మూవీలో ఉన్నాయి. టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సినిమాల్లో ఇలాంటివే చూస్తుంటాం. కానీ టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ఎలిమెంట్ మా మూవీలో చూస్తారు.
మంచి రైటర్, డైరెక్టర్
{{/usCountry}}-నేను ఆడియెన్‌గా ఇలాంటి క్యారెక్టర్‌ను లవ్ స్టోరీస్‌లో చూడలేదు. రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. సెట్‌లో ఎవరినీ హర్ట్ చేయకుండానే తనకు కావాల్సిన వర్క్ తీసుకున్నారు.
-డైరెక్టర్స్ అంటే ఇలా కూడా ఫ్రెండ్లీగా అందరితో వర్క్ చేయించుకోవచ్చని రాహుల్‌ను చూశాక తెలిసింది. స్క్రిప్ట్, క్యారెక్టర్స్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది.
ఆ ఇంప్రెషన్ కలుగుతోంది
-నేను చేసిన విక్రమ్ క్యారెక్టర్‌లో ఏదో నెగిటివ్ ఉంది. ఇతను టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అనే ఇంప్రెషన్ ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అందరిలో కలుగుతోంది. అయితే విక్రమ్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడూ ఫీల్ కావొద్దని రాహుల్ చెప్పేవారు.
ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి
-నేను స్టేజ్, ఫిలిం స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ పాత్రకు ఎలా సన్నద్ధమవ్వాలో అలా అయ్యాను. ఏ సినిమా చేసినా స్క్రిప్ట్ నాకు పర్సనల్‌గా నచ్చాలని భావిస్తా.