జైలు నుంచి తప్పించుకున్న అత్యంత క్రూరమైన కిల్లర్లను చంపే టీమ్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది హంటింగ్ పార్టీ’. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఇప్పుడు జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అదిరిపోయే యాక్షన్ తో, అంతకుమించిన థ్రిల్ తో ఈ సీజన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది ది హంటింగ్ పార్టీ సీజన్ 2.
ది హంటింగ్ పార్టీ ఓటీటీ

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఓటీటీ వెబ్ సిరీస్ ల్లో ది హంటింగ్ పార్టీ ఒకటి. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ది హంటింగ్ పార్టీ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 2లో మొత్తం 13 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి.
తెలుగులోనూ
ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అయిన ది హంటింగ్ పార్టీ సీజన్ 2 సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సీజన్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఇంగ్లీష్, తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ సిరీస్ ను చూడొచ్చు. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో రెండో సీజన్ లోని ‘రాన్ సిమ్స్’, ‘ఆడ్రియన్ గాలో’ ఎపిసోడ్లు చూడటానికి రెడీగా ఉన్నాయి.
ది హంటింగ్ పార్టీ స్టోరీ
ది హంటింగ్ స్టోరీ అనేది ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో అత్యంత రహస్యమైన జైలు ‘ది పిట్’ ఉంటుంది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన, క్రూరమైన క్రిమినల్స్ ను ఉంచుతారు. అయితే ఒక సమయంలో కొంతమంది క్రిమినల్స్ దీని నుంచి తప్పించుకుంటారు.
స్పెషల్ టీమ్
జైలు నుంచి తప్పించుకున్న క్రూరమైన క్రిమినల్స్ ను పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో బెక్స్, షేన్, టెడ్, మల్లోరీ ఉంటారు. సీజన్ 1లో ఒక్కో ఎపిసోడ్ లో తప్పించుకున్న ఒక్కో క్రిమినల్ ను ఈ టీమ్ వేటాడుతుంది. అయితే ది పిట్ వెనుకు ఉన్న సీక్రెట్స్ కూడా క్రమంగా బయటపడతాయి. క్లైమాక్స్ లో బెక్స్ తన బెస్ట్ ఫ్రెండ్ ఒలివర్ ను కోల్పోతుంది.
సీజన్ 2
{{/usCountry}}జైలు నుంచి తప్పించుకున్న క్రూరమైన క్రిమినల్స్ ను పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో బెక్స్, షేన్, టెడ్, మల్లోరీ ఉంటారు. సీజన్ 1లో ఒక్కో ఎపిసోడ్ లో తప్పించుకున్న ఒక్కో క్రిమినల్ ను ఈ టీమ్ వేటాడుతుంది. అయితే ది పిట్ వెనుకు ఉన్న సీక్రెట్స్ కూడా క్రమంగా బయటపడతాయి. క్లైమాక్స్ లో బెక్స్ తన బెస్ట్ ఫ్రెండ్ ఒలివర్ ను కోల్పోతుంది.
సీజన్ 2
{{/usCountry}}ది హంటింగ్ స్టోరీ సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ సారి టీమ్ లోకి లాజరస్ అనే పవర్ ఫుల్ లేడీ ఎంటర్ అవుతుంది. అయితే అప్పటికే టీమ్ లో ఉన్న షేన్ కు లాజరస్ తల్లి అనే ట్విస్ట్ అదిరిపోతుంది.
సీజన్ 2లో కిల్లర్లను పట్టుకునేందుకు ఈ స్పెషల్ టీమ్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎపిసోడ్ 1లో బూగీమెన్ అనే సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేస్తారు. రెండో ఎపిసోడ్ లో అడ్రియాన్ ను పట్టుకుంటారు. మరోవైపు జైలులోని రహస్యాలు కూడా బయటపడుతుంటాయి.