Christopher Nolan: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తన లేటెస్ట్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. టైమ్ ట్రావెల్, స్పేస్, సైన్స్ ఫిక్షన్, ఎపిక్ మైథాలజీ కథలను మైండ్ బ్లాకింగ్ విజువల్ గ్రాండ్‌నెస్‌తో తెరకెక్కించే నోలన్.. తనను తీవ్రంగా భయపెట్టే ఒకే ఒక్క సినీ జానర్ గురించి ఓపెన్ అయ్యారు. 'ది టునైట్ స్టారింగ్ జిమ్మీ ఫాలన్' టాక్ షోలో పాల్గొన్న ఆయన.. రొమాంటిక్ కామెడీ సినిమా తీయాలంటే తనకు చాలా భయం అని అంగీకరించారు.
"కామెడీ సినిమా తీస్తే దాక్కోవడానికి చోటుండదు!"

జిమ్మీ ఫాలన్ టాక్ షోలో సరదాగా రొమాంటిక్ కామెడీ సినిమాల గురించి చర్చ వచ్చినప్పుడు నోలన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. "నాకు పర్సనల్‌గా రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటం చాలా ఇష్టం. కానీ అలాంటి సినిమా డైరెక్ట్ చేయడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. థియేటర్‌లో కూర్చున్న జనాలను నవ్వించడం అనేది డైరెక్టర్‌కు చాలా రిస్కీ జాబ్" అని నోలన్ వివరించారు.
తన సైన్స్ ఫిక్షన్ లేదా ఎపిక్ సినిమాల్లో సీన్లు కొన్నింటిని ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోకపోతే 'వాళ్లకు కథాంశం సరిగ్గా కనెక్ట్ కాలేదులే' అని తప్పించుకునే వెసులుబాటు తనకు ఉంటుందని ఆయన నవ్వుతూ చెప్పారు. కానీ కామెడీ విషయంలో అలా దాక్కోవడానికి ఏమీ ఉండదని, థియేటర్‌లో జనాలు నవ్వకపోతే ఆ సీన్ అట్టర్‌ఫ్లాప్ అని వెంటనే తేలిపోతుందని అన్నారు. అందుకే రొమాంటిక్ కామెడీ సినిమా తీయాలంటే తనకు విపరీతమైన భయమని వ్యాఖ్యానించారు.
ది ఒడిస్సీ గ్రాండ్ సక్సెస్
రొమాంటిక్ కామెడీ తీయడానికి భయపడే నోలన్.. గ్రీక్ పురాణాల ఆధారంగా హోమర్ రాసిన 'ది ఒడిస్సీ' కావ్యాన్ని తెరకెక్కించడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. దాదాపు రూ. 2,400 కోట్ల (250 మిలియన్ డాలర్లు) పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ ఎపిక్ కోసం 6 దేశాల్లో 91 రోజుల పాటు రికార్డు స్థాయిలో షూటింగ్ చేశారు.
స్కాట్లాండ్లోని మోరే ఫిర్త్ కోస్ట్‌తో పాటు అనేక రియల్ లొకేషన్లలో ఐమాక్స్ (IMAX) కెమెరాలతో రికార్డ్ స్థాయిలో 20 లక్షల అడుగుల రీల్‌ను వాడి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. అంతేకాకుండా విజువల్ ఎఫెక్ట్స్ సహజంగా ఉండటం కోసం 60 అడుగుల భారీ అనిమేట్రానిక్ పప్పెట్‌ను ఉపయోగించి హాలీవుడ్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచారు.
మ్యాట్ డామన్ కాళ్ల గాయాలు.. టామ్ హాలండ్ భయాలు!
{{/usCountry}}స్కాట్లాండ్లోని మోరే ఫిర్త్ కోస్ట్‌తో పాటు అనేక రియల్ లొకేషన్లలో ఐమాక్స్ (IMAX) కెమెరాలతో రికార్డ్ స్థాయిలో 20 లక్షల అడుగుల రీల్‌ను వాడి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. అంతేకాకుండా విజువల్ ఎఫెక్ట్స్ సహజంగా ఉండటం కోసం 60 అడుగుల భారీ అనిమేట్రానిక్ పప్పెట్‌ను ఉపయోగించి హాలీవుడ్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచారు.
మ్యాట్ డామన్ కాళ్ల గాయాలు.. టామ్ హాలండ్ భయాలు!
{{/usCountry}}ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్‌లో ఎదురైన చిత్రమైన అనుభవాలను నటీనటులు పంచుకున్నారు. మెయిన్ లీడ్ పోషించిన మ్యాట్ డామన్ (Matt Damon) మాట్లాడుతూ.. గ్రీక్ హీరోగా రోజంతా చెప్పులు వేసుకుని రాళ్లపై తిరగడం వల్ల కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయని, వీపు నొప్పితో నరకం చూశానని చెప్పారు.
ఇక టెలిమాకస్ పాత్రలో నటించిన యంగ్ స్టార్ టామ్ హాలండ్ కు ఐమాక్స్ కెమెరాలతో పనిచేయడం ఇదే తొలిసారి. ఐమాక్స్ కెమెరా రీల్ రోల్ కేవలం 3 నిమిషాలు మాత్రమే నడుస్తుందనే విషయం తెలియక, నోలన్ పదే పదే కట్ చెప్తుంటే తన యాక్టింగ్ నచ్చకనే అలా చేస్తున్నారేమోనని విపరీతంగా భయపడిపోయానని టామ్ హాలండ్ వెల్లడించారు.
నెక్స్ట్ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారా?
'ద ఒడిస్సీ' గ్రాండ్ సక్సెస్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ కామెడీలకు ఆమడ దూరంలో ఉండే ఈ విజనరీ డైరెక్టర్.. హారర్ జానర్‌లో ఎలాంటి విజువల్ మ్యాజిక్ చేస్తారో చూడాలని వరల్డ్ సినిమా లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.