The Odyssey Trailer: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది ఆయన గ్రీకు పురాణగాథ 'ది ఒడిస్సీ' (The Odyssey)ని తెరకెక్కిస్తున్నారంటే ఆ ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హోమర్ రాసిన ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ మొదటి ట్రైలర్ మంగళవారం (మే 5) విడుదలైంది. హాలీవుడ్ దిగ్గజ నటులతో నిండిన ఈ ట్రైలర్ చూస్తుంటే.. నోలన్ మరోసారి వెండితెరపై ఒక మ్యాజిక్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది.
ఒడిస్సీగా మ్యాట్ డామన్.. భారీ తారాగణం
ట్రైలర్ ఆరంభం నుండి ముగింపు వరకు నోలన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రీకు వీరుడు ఒడిస్సస్ పాత్రలో హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ కనిపిస్తుండగా, యుద్ధం ముగిసిన తర్వాత పదేళ్ల పాటు సాగే ఆయన సముద్ర ప్రయాణం, స్వదేశం ఇథాకాకు చేరుకోవడానికి ఆయన పడే కష్టాలను అత్యద్భుతంగా చూపించారు.
ఈ సినిమాలో ఒడిస్సస్ భార్య పెనెలోప్ పాత్రలో ఆనె హాత్వే, ఆయన కుమారుడు టెలిమాకస్ పాత్రలో స్పైడర్ మాన్ ఫేమ్ టామ్ హాలండ్ నటించారు. పెనెలోప్‌ను వివాహం చేసుకోవాలని చూసే అంటినస్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్, నింఫ్ కాలిప్సోగా చార్లిజ్ థెరాన్ మెరిశారు. గ్రీకు పురాణాల్లోని ప్రమాదకరమైన సుడిగుండాలు, రాక్షస జీవి సైక్లోప్స్ వంటి విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి.
ఐమాక్స్ కెమెరాల మ్యాజిక్.. 250 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్
ఈ సినిమాను నోలన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుమారు 250 మిలియన్ డాలర్ల (రూ. 2,000 కోట్లకు పైగా) భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమా విశేషాలు ఏంటో చూడండి.
{{/usCountry}}ఈ సినిమాను నోలన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుమారు 250 మిలియన్ డాలర్ల (రూ. 2,000 కోట్లకు పైగా) భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమా విశేషాలు ఏంటో చూడండి.
{{/usCountry}}ఐమాక్స్ (IMAX): ఈ చిత్రాన్ని పూర్తిగా భారీ ఫార్మాట్ ఐమాక్స్ కెమెరాలతోనే చిత్రీకరించారు. దీని కోసం నోలన్ ఏకంగా 20 లక్షల అడుగుల ఫిలింను వాడటం గమనార్హం.
సీజీఐ (CGI) వాడకం తగ్గించి, సహజమైన లొకేషన్లలో షూట్ చేయడంలో నోలన్ దిట్ట. 'ది ఒడిస్సీ'లో కూడా అదే మాయాజాలం రిపీట్ కాబోతోంది.
ట్రోజన్ యుద్ధం తర్వాత ఒక వీరుడి ప్రయాణం, ఆయన ఎదుర్కొనే మానవాతీత శక్తుల ఇతివృత్తంతో సాగే ఈ చిత్రం జులై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ది ఒడిస్సీ' సినిమా ఏ ఇతిహాసం ఆధారంగా రూపొందుతోంది?
గ్రీకు కవి హోమర్ రాసిన అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధమైన ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమాను క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్నారు.
2. ది ఒడిస్సీ సినిమాలో నటించిన ప్రధాన నటులు ఎవరు?
మ్యాట్ డామన్ (ఒడిస్సస్), ఆనే హాత్వే (పెనెలోప్), టామ్ హాలండ్ (టెలిమాకస్), రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లిజ్ థెరాన్ కీలక పాత్రల్లో నటించారు.
3. ది ఒడిస్సీ సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రం 2026 జులై 16న ఆస్ట్రేలియాలో, జులై 17న అమెరికా, బ్రిటన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
4. ది ఒడిస్సీ సినిమాకు ఐమాక్స్ కెమెరాలు వాడటం వల్ల లాభం ఏంటి?
ఐమాక్స్ కెమెరాలు అత్యంత స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తాయి. వెండితెరపై చూసేటప్పుడు ప్రేక్షకులు ఆ కథలోనే ఉన్నామనే అనుభూతిని కలిగిస్తాయి.