The Paradise: నేచురల్ స్టార్ నాని తన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' చెన్నై ప్రెస్ మీట్‌లో చాలానే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళ సినిమా తనకు బైబిల్ లాంటిదని, సౌత్ సినిమాలను మాత్రమే 'పాన్ ఇండియా' అని పిలవడంపై తన అసంతృప్తిని బయటపెట్టి సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రమోషన్లలో భాగంగా తమిళ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నాని.. ఈ సినిమా కేవలం పెద్దవాళ్లకే అని, పిల్లలకు కాదని అన్నారు. అంతేకాదు తమిళ చిత్ర పరిశ్రమపై తనకున్న ప్రేమాభిమానాలను ఓపెన్‌గా పంచుకున్నారు.
"చెన్నైలో కాలు పెట్టగానే ఆ ఫీలింగ్ వచ్చింది!"
ఏదో సినిమా ప్రమోషన్ల కోసం ఈ మాటలు చెప్పడం లేదని నాని స్పష్టం చేశారు. "చెన్నైలో ల్యాండ్ అవ్వగానే నా గత జన్మ బంధం ఏదో ఇక్కడే ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. తమిళ సినిమా నాకు బైబిల్ లాంటిది" అని నాని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
సినిమా రంగంపై తనకు ఆసక్తి, అమితమైన ప్రేమ కలగడానికి కమల్ హాసన్, మణిరత్నం, భాగ్యరాజ్, భారతిరాజా లాంటి దిగ్గజ నటులు, దర్శకులే కారణమని గుర్తు చేసుకున్నారు. నాటి 'నాని' సినిమా రోజుల నుంచే తమిళ ప్రేక్షకులు తనను సొంత మనుషిలా ఆదరిస్తున్నారని, ఆ ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.
'పాన్ ఇండియా' కాన్సెప్ట్‌పై నాని అసహనం
ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకు ఇస్తున్న 'పాన్ ఇండియా' ట్యాగ్‌పై నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "ఒక హిందీ సినిమా దేశవ్యాప్తంగా బాగా ఆడితే దాన్ని మనం 'హిందీ సినిమా' అని మాత్రమే అంటాం. కానీ సౌత్ సినిమా హిట్ అయితే మాత్రం దాన్ని 'పాన్ ఇండియా సినిమా' అని పిలుస్తారు" అని నాని ప్రశ్నించారు.
{{/usCountry}}ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకు ఇస్తున్న 'పాన్ ఇండియా' ట్యాగ్‌పై నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "ఒక హిందీ సినిమా దేశవ్యాప్తంగా బాగా ఆడితే దాన్ని మనం 'హిందీ సినిమా' అని మాత్రమే అంటాం. కానీ సౌత్ సినిమా హిట్ అయితే మాత్రం దాన్ని 'పాన్ ఇండియా సినిమా' అని పిలుస్తారు" అని నాని ప్రశ్నించారు.
{{/usCountry}}ఈ వ్యత్యాసం తనకు నచ్చదని, అందుకే తన సినిమాలను 'పాన్ ఇండియా' అని పిలవడం తనకు అస్సలు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. కంటెంట్ బాగుంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న ప్రేక్షకుడైనా సినిమాను ఆదరిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్.. 'సమ్మక్క' ఆల్టర్నేటివ్ టైటిల్ లీక్
ఈ సినిమాలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వర్క్ గురించి కూడా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అనిరుధ్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ సర్ అంటే ప్రాణం, ఆయనకు రజనీసారే ఫేవరెట్.. కానీ తెలుగు ఆడియన్స్‌కు అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చే కిక్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది" అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక సినిమాలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి పాత్ర గురించి యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నకు నాని ఊహించని ఆన్సర్ ఇచ్చారు. "ఈ సినిమాకు 'ది ప్యారడైజ్' కాకుండా మరో టైటిల్ పెట్టాల్సి వస్తే అది ఖచ్చితంగా 'సమ్మక్క' అని ఉంటుంది.. ఎందుకంటే ఇది పూర్తిగా ఆవిడ క్యారెక్టర్ చుట్టూ తిరిగే మూవీ" అని సీక్రెట్ బయటపెట్టారు.
'దసరా' బ్లాక్‌బస్టర్ కాంబో రీ-యూనియన్
'దసరా' మూవీతో బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మళ్లీ ఈ సినిమాతో ఒకటైంది. ఎస్‌ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ ప్రాజెక్ట్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
'కిల్' మూవీ ఫేమ్ రాఘవ్ జుయల్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్లుగా ఇంటెన్స్ రోల్స్‌లో కనిపిస్తుండటంతో సెప్టెంబర్ 24న రిలీజ్ కానున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.