The Paradise Runtime: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ది పారడైజ్' సెన్సార్ ప్రాసెస్ గురించిన అప్‌డేట్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. సెన్సార్ బోర్డు (CBFC) ఈ సినిమాకి ఏకంగా 21 కట్స్ సూచిస్తూ 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ మంజూరు చేసింది.
సీన్లకు కత్తెర.. హీరో చేతిపై ఉన్న ఆ బూతు టాటూ తొలగింపు

ది పారడైజ్ సినిమాలో చూపించిన కొన్ని విపరీతమైన వైలెన్స్ సీన్లు, తీవ్రమైన బూతు మాటలు, హీరో క్యారెక్టర్ చేతిపై ఉన్న వివాదాస్పద టాటూపై సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు సూచనల మేరకు మేకర్స్ సదరు హింసాత్మక దృశ్యాలను ఎడిట్ చేయడంతో పాటు కొన్ని డైలాగ్స్‌ని మ్యూట్ చేసి, చట్టబద్ధమైన హెచ్చరికల కార్డ్స్ యాడ్ చేయక తప్పలేదు.
కత్తిరింపుల తర్వాత ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్‌ను 174 నిమిషాలుగా (2 గంటల 54 నిమిషాలు) లాక్ చేశారు. ప్రారంభంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్ ప్లాన్ చేసినప్పటికీ, సెన్సార్ సూచించిన ఎడిటింగ్ మార్పుల వల్ల నిడివి కాస్త పెరిగినట్లు తెలుస్తోంది.
నాని ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్
సెన్సార్ బోర్డు ఈ సినిమాపై ఇన్ని కట్స్ విధించడం పట్ల నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'దసరా' లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడం వల్ల ఈ రా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఒక అణచివేతకు గురైన సమాజం హక్కుల కోసం తిరుగుబాట పట్టే కథాంశంతో ఈ పీరియాడిక్ మాస్ డ్రామా రూపుదిద్దుకుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
8 భాషల్లో భారీ రిలీజ్.. ఎలాంటి ట్రైలర్ లేకుండానే రికార్డు హైప్
{{/usCountry}}ఒక అణచివేతకు గురైన సమాజం హక్కుల కోసం తిరుగుబాట పట్టే కథాంశంతో ఈ పీరియాడిక్ మాస్ డ్రామా రూపుదిద్దుకుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
8 భాషల్లో భారీ రిలీజ్.. ఎలాంటి ట్రైలర్ లేకుండానే రికార్డు హైప్
{{/usCountry}}నాని తన 18 ఏళ్ల యాక్టింగ్ కెరీర్‌లోనే అత్యంత కష్టపడి చేసిన ల్యాండ్‌మార్క్ మూవీగా 'ది పారడైజ్' నిలవనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం సహా దాదాపు 8 భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ట్రైలర్ రిలీజ్ చేయకుండానే కేవలం టీజర్, సాంగ్స్‌తోనే బిజినెస్ క్లోజ్ చేయడం, బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయడం విశేషం.