కొంతకాలంగా ఫుల్ యాక్షన్, మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ది రాజా సాబ్ తో తెరపై కొత్తగా కనిపించాడు. వింటేజీ లుక్ తో పాటు కామెడీ టైమింగ్, డ్యాన్స్ లతో ఇరగదీశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ఓటీటీ వివరాలు, డిజిటల్ రైట్స్ రేట్ గురించి తెలుసుకుందాం.
రాజా సాబ్ ఓటీటీ

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా శుక్రవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది రాజా సాబ్ చిత్రంపై మిక్స్ డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లో రిలీజ్ కానుంది. ది రాజా సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.
టీవీలో ఎక్కడ?
ది రాజా సాబ్ డిజిటల్ రైట్స్ ను జియోహాట్‌స్టార్ దక్కించుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. అంటే టీవీలో ది రాజా సాబ్ మూవీని స్టార్ మా ఛానెల్లో చూడొచ్చన్నమాట. ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ మూవీ టీవీ ప్రీమియర్ కు వచ్చే అవకాశముంది.
డిజిటల్ రైట్స్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ది రాజా సాబ్ పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ కావడం, ప్రభాస్ కూడా వింటేజ్ లుక్ లో అదరగొట్టడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలిపి సుమారు రూ.180 నుంచి రూ.200 కోట్ల వరకు పలికినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కంటే ముందు మంచి డీల్ కుదిరిందని టాక్.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఫిబ్రవరి రెండో వారం నుంచి నాలుగో వారం మధ్యలో ది రాజా సాబ్ జియోహాట్స్టార్లోకి వచ్చే అవకాశముంది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత మంచి అకేషన్ చూసి టీవీల్లో స్ట్రీమింగ్ చేస్తారు.
{{/usCountry}}సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఫిబ్రవరి రెండో వారం నుంచి నాలుగో వారం మధ్యలో ది రాజా సాబ్ జియోహాట్స్టార్లోకి వచ్చే అవకాశముంది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత మంచి అకేషన్ చూసి టీవీల్లో స్ట్రీమింగ్ చేస్తారు.
{{/usCountry}}ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది.