ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. తమ ఫేవరెట్ డార్లింగ్ ను చూడాలని, ఆయన మాటలను వినాలని చూస్తున్న అభిమానులు ఎంతో మంది. మరికొన్ని నిమిషాల్లోనే వీళ్లందరితో మాట్లాడేందుకు ప్రభాస్ వచ్చేస్తున్నాడు. ఈ రోజు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో సందడిగా జరుగుతోంది.
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ చాలా కాలం తర్వాత వింటేజీ లుక్ లో కనిపించడంతో రాజాసాబ్ మూవీపై క్రేజీ బజ్ నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
ప్రభాస్ స్పీచ్
డార్లింగ్ ప్రభాస్ కు మొహమాటం ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. బయట ఎక్కువ కనిపించరు. ఈవెంట్లో కూడా పొడిపొడిగా మాట్లాడేసి వెళ్లిపోతారు. అలాంటి ప్రభాస్ దాదాపు మూడేళ్ల తర్వాత ఇలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించబోతున్నారు. సలార్ మూవీ ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయిపోయింది. కల్కి మూవీకి మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ కనిపించారు. ఇప్పుడు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడబోతున్నాడు.
భారీ హైప్
రాజాసాబ్ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలను మరింత పెంచేశాయి. వింటేజీ లుక్ లో, తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు ప్రభాస్. వరుసగా యాక్షన్ సినిమాల్లో ప్రభాస్ ను చూస్తున్న ఫ్యాన్స్ కు రాజాసాబ్ కొత్త ఫీలింగ్ ఇవ్వనుంది. పైగా ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ హారర్ మూవీ ఇదే.
రిలీజ్ డేట్
మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజాసాబ్ మూవీ సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది పండగ సందడి ప్రభాస్ సినిమాతోనే స్టార్ట్ కానుంది. ఈ రోజు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న కైత్లాపూర్ గ్రౌండ్ లో రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. కాసేపట్లో ప్రభాస్ రానున్నాడు.
{{/usCountry}}మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజాసాబ్ మూవీ సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది పండగ సందడి ప్రభాస్ సినిమాతోనే స్టార్ట్ కానుంది. ఈ రోజు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న కైత్లాపూర్ గ్రౌండ్ లో రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. కాసేపట్లో ప్రభాస్ రానున్నాడు.
{{/usCountry}}