...
...
Next Story

ది రాజా సాబ్ నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన’ రిలీజ్.. ప్రభాస్, నిధి మెలోడీ సాంగ్

ది రాజా సాబ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. సహన సహన అంటూ సాగిపోయే ఈ మెలోడీ పాటలో ప్రభాస్, నిధి అగర్వాల్ అదిరిపోయే లొకేషన్లలో స్టెప్పులేశారు. యూట్యూబ్ లో కేవలం రెండున్నర నిమిషాల సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు.

Published on: Dec 17, 2025 08:51 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ నుంచి సహన సహన అనే సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. బుధవారం (డిసెంబర్ 17) మేకర్స్ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్పెయిన్ లోని అదిరిపోయే లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించడం విశేషం.

సహన సహన సాంగ్ రిలీజ్

ది రాజా సాబ్ నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన’ రిలీజ్.. ప్రభాస్, నిధి మెలోడీ సాంగ్
ది రాజా సాబ్ నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన’ రిలీజ్.. ప్రభాస్, నిధి మెలోడీ సాంగ్

ది రాజా సాబ్ మూవీ నుంచి ఇప్పటికే ఓ టీజర్, ఫస్ట్ సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ సింగిల్ కూడా వచ్చేసింది. సహన సహన అంటూ సాగిపోయే మెలోడీ ఇది. ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా.. కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. ప్రభాస్, నిధి అగర్వాల్ పై ఈ సాంగ్ షూట్ చేశారు. ఇందులో ప్రభాస్ తన సింపుల్ స్టెప్స్ తో అదరగొట్టాడు. తన స్టైల్, గ్రేస్ తో ప్రభాస్ చాలా అందంగా కనిపించాడు.

ఈ సహన సహన సాంగ్ యూట్యూబ్ లో కేవలం రెండున్నర నిమిషాలే ఉండగా.. స్పాటిఫైలాంటి మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ లో మాత్రం నాలుగున్నర నిమిషాల పాటు ఉండటం విశేషం. తమన్ కాస్త డిఫరెంట్ మ్యూజిక్ తో ఈ సహన సహనను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

ది రాజా సాబ్ ప్రీమియర్ షోస్

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్లో వస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్ షోస్ జనవరి 8న ఇండియాలో ఉంటాయని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కన్ఫమ్ చేశాడు. ఇక హైదరాబాద్ లోనే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేయబోతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe