భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చి నిరాశపర్చిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది.
రాజాసాబ్ ఓటీటీ

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీ వ్యూయర్స్ కు ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
ఎక్సెటెండెడ్ కట్
రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో సినీ లవర్స్ కు జియోహాట్‌స్టార్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ మూవీని ఎక్సెటెండెడ్ కట్ తో స్ట్రీమింగ్ చేయనుంది. అంటే థియేటర్లలో ప్రీమియర్ అయిన సినిమాలో లేని సీన్లు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న రాజాసాబ్ మూవీలో ఉండబోతున్నాయి. ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఏ సీన్లు యాడ్ చేశారోనని థ్రిల్ ఫీల్ అవుతున్నారు.
సంక్రాంతి రిలీజ్
సంక్రాంతి 2026 సందర్భంగా రాజాసాబ్ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు. భారీ అంచనాలతో రిలీజైన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర తన సక్సెస్ ఫుల్ రన్ కొనసాగించలేకపోయింది. అదిరే ఓపెనింగ్స్ తర్వాత మూవీ ఒక్కసారిగా పడిపోయింది.
నెల రోజుల్లోపే
{{/usCountry}}సంక్రాంతి 2026 సందర్భంగా రాజాసాబ్ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు. భారీ అంచనాలతో రిలీజైన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర తన సక్సెస్ ఫుల్ రన్ కొనసాగించలేకపోయింది. అదిరే ఓపెనింగ్స్ తర్వాత మూవీ ఒక్కసారిగా పడిపోయింది.
నెల రోజుల్లోపే
{{/usCountry}}థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన రాజాసాబ్ మూవీ ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి అంటే డేట్ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 6 నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు.
తన నానమ్మ కోరిక మేరకు తాతయ్యను వెతుక్కుంటూ హీరో ఓ రాజ మహల్ కు వెళ్తాడు. అక్కడి వెళ్లిన తర్వాత అన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అందరూ రివర్స్ లో వేలాడుతారు. హీరో ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రాజ మహల్ లో విచిత్రాలకు కారణం ఎవరు? అన్నది రాజాసాబ్ మూవీలో చూడాల్సిందే.