The Red Bag Release Date Announced PVR Inox: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.
యూట్యూబ్‌లో ది రెడ్ బ్యాగ్ పాటలకు మంచి వ్యూస్

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ది రెడ్ బ్యాగ్ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ది రెడ్ బ్యాగ్ గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మోపురి అందించిన పాటలు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఆగస్ట్ 21న థియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ
ప్రమోషన్లలో వేగం పెంచిన చిత్రబృందం తాజాగా ది రెడ్ బ్యాగ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థకు థియేట్రికల్ హక్కులు
సినీ పంపిణీ రంగంలో ఎన్నో భారీ విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన ప్రముఖ సంస్థ 'పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్' (PVR INOX Pictures) ది రెడ్ బ్యాగ్ సినిమా నైజాం, ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పోస్టర్‌తో పెరిగిన ఉత్కంఠ..
విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ది రెడ్ బ్యాగ్ సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను బయటకు వదిలారు. అందులో ముగ్గురు యువతులు చేతిలో హాకీ స్టిక్స్ పట్టుకుని డిఫరెంట్ యాంగిల్స్‌లో పోజులు ఇచ్చారు. ఇదివరకు విడుదల చేసిన పోస్టర్‌లో అదే ముగ్గురు యువతులు చేతిలో గన్స్ పట్టుకుని కనిపించి అట్రాక్ట్ చేశారు.
క్యూరియాసిటీ పెంచుతున్న కథ!
వారి చేతిలో తుపాకులతోపాటు, వద్ద ఉన్న ఒక రహస్యమైన 'రెడ్ బ్యాగ్', సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ సీన్లు ఈ పోస్టర్‌లో కనిపించి సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఇలా డిఫరెంట్ పోస్టర్స్ ద్వారా ది రెడ్ బ్యాగ్ కథపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
రెడ్ బ్యాగ్ చుట్టూ రహస్యాలు, మలుపులు
{{/usCountry}}వారి చేతిలో తుపాకులతోపాటు, వద్ద ఉన్న ఒక రహస్యమైన 'రెడ్ బ్యాగ్', సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ సీన్లు ఈ పోస్టర్‌లో కనిపించి సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఇలా డిఫరెంట్ పోస్టర్స్ ద్వారా ది రెడ్ బ్యాగ్ కథపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
రెడ్ బ్యాగ్ చుట్టూ రహస్యాలు, మలుపులు
{{/usCountry}}ఈ రెడ్ బ్యాగ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాని చుట్టూ తిరిగే కథనంలో ఉండే మలుపులు ఎలాంటివి? అనే విషయాలను మేకర్స్ చాలా రహస్యంగా ఉంచారు. థియేటర్లో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించడానికే కథను సస్పెన్స్‌గా ఉంచినట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.
ది రెడ్ బ్యాగ్ నటీనటులు
ఇకపోతే ది రెడ్ బ్యాగ్ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రియేష్ గురుస్వామి అందించిన ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
త్వరలో ది రెడ్ బ్యాగ్ ట్రైలర్
అలాగే, శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. విక్రమ్ రాజా ది రెడ్ బ్యాగ్ చిత్రానికి కథను అందించారు. రాబోయే రోజుల్లో ది రెడ్ బ్యాగ్ ట్రైలర్, మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో థియేట్రికల్ బజ్ మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.