...
...
Next Story

Horror Thriller OTT: ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రైబ‌ర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త‌మ‌న్నా హార‌ర్ థ్రిల్ల‌ర్ ఆ రోజు నుంచి ఫ్రీ!

Horror Thriller OTT: ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ఉందా? హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే ఈ అదిరిపోయే న్యూస్ మీ కోసమే. తమన్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రైమ్ వీడియో యూజర్స్ కోసం ఫ్రీ స్ట్రీమింగ్ కానుంది. ఇన్ని రోజులు రెంట్ విధానంలో ఉన్న ఈ సినిమాను ఇక అందరికీ అందుబాటులోకి రానుంది.

Published on: Nov 18, 2026, 10:13:18 IST
Advertisement

Horror Thriller OTT: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ది వాన్’. థియేటర్లలో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ప్రైమ్ వీడియో యూజర్లకు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

ది వాన్ ఓటీటీ

ప్రైమ్ వీడియో ఓటీటీ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌..త‌మ‌న్నా హార‌ర్ థ్రిల్ల‌ర్‌ ఆ రోజు నుంచి ఫ్రీ (PTI)
ప్రైమ్ వీడియో ఓటీటీ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌..త‌మ‌న్నా హార‌ర్ థ్రిల్ల‌ర్‌ ఆ రోజు నుంచి ఫ్రీ (PTI)

బాలీవుడ్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ది వాన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఇన్ని రోజులూ ఈ చిత్రం రెంట్ విధానంలో ఉంది. అంటే ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ఉన్నా కూడా.. ది వాన్ సినిమాను చూడాలంటే ఎక్స్ ట్రా రెంట్ కట్టాల్సిందే.

ఫ్రీ స్ట్రీమింగ్

ఇప్పుడు ది వాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ మూవీపై ఉన్న రెంట్ ను తొలగించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రైమ్ సబ్ స్క్రైబర్లు అందరూ ఈ సినిమా ఎలాంటి రెంట్ పే చేయకుండా చూసేయొచ్చు. తమన్నా హారర్ థ్రిల్లర్ ను ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.

కొత్త ప్రపంచం

ది వాన్ సినిమాలో ఆడియన్స్ కు మేకర్స్ కొత్త ప్రపంచం చూపించారు. ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన ఈ హారర్ థ్రిల్లర్ థియేటర్లలో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేసింది. ఇక స్టోరీ లైన్ డిఫరెంట్ గా ఉండటంతో పాటు తమన్నా, సిద్ధార్థ్ కెమిస్ట్రీ కూడా సినిమాకు కలిసొచ్చింది.

ది వాన్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ ఫ్రాంఛైజీని విస్తరించాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకే తాజాగా ది వాన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ది వాన్ 2 ప్రకటనతో మరోసారి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ది వాన్ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా డ్యుయల్ రోల్ లో మెప్పించాడు. అతడి భార్య మమత పాత్రలో తమన్నా అద్భుతంగా నటించింది. వీరికి తోడు బుల్లితెర స్టార్ శ్వేతా తివారి, కమెడియన్ సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, అనూప్ సోని వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks