...
...
Next Story

OTT Release: టీనేజీలోనే శృంగారం-ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో ఊహించని రిస్క్-ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త తెలుగు సినిమా!

OTT Release: డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘తెల్ల కాగితం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ఇవాళ ప్రకటించారు. టీనేజీ లవ్, రొమాన్స్, సెక్స్, ఎమోషన్స్ తదితర అంశాలతో ఈ తెల్ల కాగితం సినిమా తెరకెక్కింది.

Published on: Oct 24, 2026, 19:46:56 IST
Advertisement

OTT Release: కంటెంట్ ఓరియెంటెడ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లను ప్రోత్సహించడంలో ముందంజలో ఉండే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఈటీవీ విన్' (ETV Win) మరో సరికొత్త చిత్రంతో సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న హార్ట్ టచింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'తెల్ల కాగితం' (Thella Kaagitham) ఇప్పుడు ఇదే ఓటీటీలో డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది.

తెల్ల కాగితం రిలీజ్ డేట్

టీనేజీలోనే శృంగారం-ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో ఊహించని రిస్క్-ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త తెలుగు సినిమా!
టీనేజీలోనే శృంగారం-ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో ఊహించని రిస్క్-ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త తెలుగు సినిమా!

నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఫీల్ గుడ్ టీనేజ్ డ్రామా తెల్ల కాగితం ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే గురువారం అంటే అక్టోబర్ 29, 2026న ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తూ అనౌన్స్ చేసింది.

‘తెల్ల కాగితం’ అసలు కథేంటంటే?

భీమవరం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన రాము (హర్ష్ రోషన్), ఆశా (నక్షత్ర) ఒకే స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతుంటారు. రాముది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కాగా, ఆశా ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. క్లాస్‌మేట్స్‌గా ఉన్న వీరిద్దరి మధ్య పరిచయం మెల్లగా చిగురించి.. గాఢమైన ప్రేమగా మారుతుంది.

అయితే వయసు ఆకర్షణ, ఇంటర్నెట్, స్నేహితుల రాంగ్ గైడెన్స్, క్షణికమైన తొందరపాటు కారణంగా ఒకరోజు వీరిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. ఆ తర్వాత ఆశా గర్భం దాల్చిందనే అనుమానం రావడంతో ఈ ఇద్దరు టీనేజర్ల జీవితాలు ఒక్కసారిగా తలకిందులవుతాయి.

ప్రస్తుత జనరేషన్‌లో టీనేజర్లు వయసు ప్రభావం వల్ల చేసే చిన్న చిన్న తప్పులు వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తాయనే విషయాన్ని దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ప్రేమలో పడటం తప్పు కాదు కానీ, బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తే జీవితం రాతలు లేని ఒక 'తెల్ల కాగితం' లాగా మారిపోతుందనే సందేశాన్ని ఇందులో ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలు తమకు ఏదైనా సమస్య వస్తే భయపడకుండా తల్లిదండ్రులతో పంచుకోవాలనే మంచి పాయింట్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు.

ఈ నటీనటులు

'కోర్ట్' సినిమా ఫేమ్ హర్ష్ రోషన్ అమాయకపు పల్లెటూరి కుర్రాడిగా అద్భుతమైన నటన కనబరచగా, కొత్తమ్మాయి నక్షత్ర తన పాత్రలో ఒదిగిపోయింది. వీరితో పాటు సీనియర్ నటుడు అజయ్, శరణ్య ప్రదీప్, రాజ్ కుమార్ కసిరెడ్డి, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన వారు, ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని చూడాలనుకుంటే ఈ అక్టోబర్ 29న ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks