...
...
Next Story

Telugu OTT: ఊర్లో ఉన్న ఒక్క టీవీ దొంగతనం.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విలేజ్ కామెడీ డ్రామా.. కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా

Telugu OTT: రీసెంట్ గా రిలీజై, థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన కామెడీ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన సినిమా ఇది. దీని వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: May 7, 2026, 13:45:04 IST
Advertisement

Telugu OTT: లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఊర్లో ఉన్న ఒకే ఒక్క టీవీ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది.

తిమ్మరాజుపల్లి టీవీ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగు సినిమా (x/ahavideoIN)
ఓటీటీలోకి తెలుగు సినిమా (x/ahavideoIN)

విలేజ్ కామెడీ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఈ చిత్రం మే 15, 2026 న ఓటీటీలో అడుగుపెట్టనుంది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో ఈ తిమ్మరాజుపల్లి టీవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో గురువారం (మే 7) అనౌన్స్ చేసింది.

‘‘ఒక టీవీ మిస్సింగ్. ఒక దొంగపై నింద. నిజం కోసం ఎదురు చూసే ఒక గ్రామం. తిమ్మరాజుపల్లి టీవీ మే 15న ఆహాలో ప్రీమియర్ కానుంది. ఆహా గోల్డ్ యూజర్లు 24 గంటల ముందే చూడొచ్చు’’ అని ఆహా వీడియో పోస్టు చేసింది.

ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కథ 1996 సమయంలోని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. తిమ్మరాజుపల్లి అనేది ఓ పల్లెటూరు. ఆ గ్రామంలో ప్రతి శివరాత్రికి ఊరు జనాలంతా కలిసి చందాలేసుకుని పండుగ జరుపుకొంటారు. సాయంత్రం అద్దెకు తెచ్చుకున్న టీవీ, వీసీఆర్లో కొత్త సినిమాలు వేసుకుని ఎంటర్ టైన్ అవుతారు. అలాంటి ఊరిలోకి తొలిసారిగా సొంతంగా టీవీ కొనుక్కుని తెచ్చుకుంటాడు రాజప్ప (ప్రదీప్ కొట్టె).

దాంతో రాజప్ప ఇంట్లోనే ఊరంతా టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తారు. మరోవైపు ఊరిలో చిల్లర దొంగతనాలు చేసే సతీష్ (సాయితేజ్), రాజప్ప చెల్లి శారద (వేద జలంధర్)ను ప్రేమిస్తుంటాడు. టీవీ సాకుతో ప్రతిరోజు శారద కోసం రాజప్ప ఇంటికి వెళ్తాడు సతీష్.

ఓసారి సతీష్, శారద ప్రేమ విషయం తెలిసి పెద్ద గొడవ అవుతుంది. కట్ చేస్తే రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం అవుతుంది. ఆ టీవీని సతీషే దొంగలించాడని ఊరంతా నిందిస్తారు. సతీష్‌కు తనపై పడిన నింద పోగొట్టుకునేందుకు 14 రోజుల గడువు ఇస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది తిమ్మరాజుపల్లి టీవీ మూవీ మిగతా స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks