...
...
Next Story

Flop Hero: 20 ఏళ్లలో రెండే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్, 8 ఫ్లాప్‌లు- అయినా ఈ హీరోతో ఏకంగా 4 వేల కోట్ల సినిమా- అతనెవరంటే?

This Hero Has 2 Blockbuster Hits In 20 Years: రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో కేవలం రెండు ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్లు, ఎనిమిది పరాజయాలు నమోదు చేసినప్పటికీ ఈ స్టార్ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఆయనతో ఏకంగా రూ. 4,000 కోట్ల సినిమా చేశారు నిర్మాతలు.

Published on: Nov 10, 2026, 06:20:29 IST
Advertisement

This Hero Has 2 Blockbuster Hits In 20 Years: చిత్రసీమలో ఒక్క ప్లాప్ పడితేనే హీరోల మార్కెట్ ఊగిసలాడుతుంది. అలాంటిది దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో ఎనిమిది ఫ్లాప్‌లు, అనేక సగటు చిత్రాలు వచ్చినా ఒక నటుడి ఇమేజ్, క్రేజ్ కొద్దిగా కూడా తగ్గలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.

బాక్సాఫీస్ సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా

20 ఏళ్లలో రెండే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్, 8 ఫ్లాప్‌లు- అయినా ఈ హీరోతో ఏకంగా 4 వేల కోట్ల సినిమా- అతనెవరంటే?
20 ఏళ్లలో రెండే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్, 8 ఫ్లాప్‌లు- అయినా ఈ హీరోతో ఏకంగా 4 వేల కోట్ల సినిమా- అతనెవరంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. బాక్సాఫీస్ సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రూ. 4,000 కోట్ల బడ్జెట్ చిత్రం 'రామాయణ'లో ఆయన కథానాయకుడిగా నటించారు.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక నటుడి సక్సెస్ రేట్ ఆధారంగానే నిర్మాతలు కోట్లు గుమ్మరిస్తారు. కానీ, రణ్‌బీర్ కపూర్ విషయంలో ఈ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. బాలీవుడ్ హంగామా గణాంకాల ప్రకారం ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు నమోదైన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్లు కేవలం రెండే కావడం గమనార్హం.

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఆ రెండు చిత్రాలు

రాయ్‌చంద్ కుటుంబ వారసుడిగా 'సావరియా' చిత్రంతో అడుగుపెట్టిన రణ్‌బీర్, నటుడిగా ప్రశంసలు పొందినా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడానికి సమయం పట్టింది. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన తొలి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ 'సంజు' (2018).

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన సంజు చిత్రం తొలి రోజే రూ. 34.75 కోట్లు వసూలు చేసింది. మొదటి వారాంతానికి రూ. 120.06 కోట్లు రాబట్టి, లాంగ్‌రన్‌లో ఏకంగా రూ. 342.53 కోట్ల వసూళ్లు సాధించింది.

అయితే రణ్‌బీర్ కపూర్ ఈ విజయాల వెనుక పెద్ద ఫ్లాప్‌ల జాబితా కూడా ఉంది. నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్నాయి. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'తమాషా' కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారినప్పటికీ, విడుదలైన సమయంలో డిజాస్టర్‌గా నిలిచింది.

అలాగే అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'బేషరమ్' తొలిరోజు రూ. 21.56 కోట్లు సాధించినా, చివరకు రూ. 59.79 కోట్లకే పరిమితమైంది. అనురాగ్ కశ్యప్ భారీ అంచనాలతో తీసిన 'బాంబే వెల్వెట్' రూ. 23.67 కోట్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'షంషేరా' (రూ. 42.48 కోట్లు)తో పాటు 'జగ్గా జాసూస్', 'రాయ్', తొలి చిత్రం 'సావరియా' కూడా ఫ్లాప్‌ల జాబితాలోనే చేరాయి.

హిట్‌లు, సగటు చిత్రాల ప్రయాణం

పరాజయాలు ఉన్నప్పటికీ రణ్‌బీర్ ఖాతాలో కొన్ని హిట్‌లు, యావరేజ్ సినిమాలు ఉన్నాయి. 'బర్ఫీ' రూ. 112.15 కోట్లు వసూలు చేసి హిట్ అనిపించుకోగా, యూత్‌ను ఆకట్టుకున్న 'యే జవానీ హై దివానీ' రూ. 188.57 కోట్లతో సూపర్‌హిట్‌గా నిలిచింది.

'ఏ దిల్ హై ముష్కిల్' (రూ. 112.48 కోట్లు), 'తూ జూఠీ మై మక్కార్' (రూ. 149.05 కోట్లు) సెమీ హిట్‌లుగా నిలిచాయి. రూ. 257.44 కోట్లు రాబట్టిన బిగ్ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్-1' బాక్సాఫీస్ వద్ద సగటు (యావరేజ్) ఫలితాన్నే సాధించింది.

రూ. 4000 కోట్ల 'రామాయణ'పై నిర్మాతల ధీమా

ఇన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రణ్‌బీర్ కపూర్‌పై బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు కోట్లాది రూపాయల నమ్మకాన్ని ఉంచుతున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' కోసం రణ్‌బీర్‌ను కథానాయకుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు రూ. 4,000 కోట్లు అని సమాచారం.

కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, ఒక పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసే రణ్‌బీర్ కపూర్ నటన, స్టార్ పవర్, వర్సటైలిటీయే ఇందుకు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంతటి కష్టమైన పాత్రనైనా సహజంగా పండించగల రణ్‌బీర్ అభినయంపై ఉన్న అపారమైన నమ్మకమే ఆయనను భారతీయ చలనచిత్ర రంగాన ఈ స్థాయి బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌కి నాయకుడిగా నిలబెట్టింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks