...
...
Next Story

ఈ వారం ఓటీటీలోని మలయాళం సినిమాలు.. ఈ 3 చాలా స్పెషల్.. కోర్టు, సైకలాజికల్ థ్రిల్లర్లు.. ఓ లుక్కేయండి

ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మలయాళం సినిమాలు వచ్చేశాయి. ఇందులో ఈ 3 చాలా స్పెషల్ గా ఉన్నాయి. వీటిలో కోర్టు, సైకలాజికల్ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి.

Published on: Oct 17, 2025, 05:47:22 IST
Advertisement

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది. డిఫరెంట్ జోనర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇక ఓటీటీలో మలయాళం చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న, రాబోతున్న ఈ మలయాళం స్పెషల్ సినిమాలపై ఓ లుక్కేయండి.

అభ్యంతార కుట్టవాళి

ఓటీటీలో ఈ వారం మలయాళం సినిమాలు (X)
ఓటీటీలో ఈ వారం మలయాళం సినిమాలు (X)

అభ్యంతార కుట్టవాళి అనేది సమస్యాత్మక రెండవ వివాహంలో ఉన్న ఒక వ్యక్తి గురించిన చిత్రం. అతను తప్పుడు గృహ హింస, వరకట్న కేసును ఎదుర్కొంటాడు. ఈ వాదనలతో న్యాయ పోరాటాలు ముడిపడి ఉన్నప్పుడు విడాకుల సమస్యలను ఎదుర్కొంటాడు. న్యాయం కోసం పోరాడతాడు. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, జగదీష్, హరిశ్రీ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు నటించారు. ఇది కోర్టు డ్రామా థ్రిల్లర్. అభ్యంతార కుట్టవాళి మూవీ అక్టోబర్ 17న ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంబామ్

మిరాజ్

సస్సెన్స్ థ్రిల్లర్లను తెరకెక్కించడంలో దిట్ట అయిన డైరెక్టెర్ జీతు జోసెఫ్ నుంచి వచ్చిన మరో థ్రిల్లర్ మూవీ మిరాజ్. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. మిరాజ్ అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. తనకు కాబోయే భర్త మిస్సింగ్ తో ఆ అమ్మాయి షాక్ కు గురవుతుంది.

కానీ ఆ అమ్మాయి ఆశలు వదులుకోదు. ఇది తప్పిపోయిన తన కాబోయే భర్త కోసం వెతుకుతున్న ఒక మహిళతో పాటు బలవంతంగా చేరిన ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ మిరాజ్. ఈ మలయాళం ఒరిజినల్ సినిమాలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, హక్కిం షాజహాన్, హన్నా రేజి కోషి, దీపక్ పరంబోల్ తదితరులు నటించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 20న స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ ఓటీటీ యాప్ లోకి అందుబాటులోకి వస్తుంది. సస్సెన్స్, థ్రిల్ తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ కావాలనుకునే ఓటీటీ ఆడియన్స్ కు మిరాజ్ మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks