ఈ పండగ సీజన్ సందడిని మరింత పెంచేందుకు ఓటీటీలో కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఈ వారం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు చాలా సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వారం ఓటీటీలో చూడాల్సిన స్పెషల్ సినిమాలు ఏంటో ఇక్కడ చూసేయండి. ఇందులో మర్డర్ మిస్టరీ, ఫ్యాంటసీ, హారర్ థ్రిల్లర్లున్నాయి.
భగవత్ చాప్టర్ 1: రాక్షస్

జీ5 ఓటీటీలోకి రాబోతున్న మర్డర్ మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ భగవత్ చాప్టర్ 1: రాక్షస్. ఈ జీ5 స్పెషల్ చిత్రంలో అర్షద్ వార్సీ టైటిల్ రోల్ అయిన ఇన్‌స్పెక్టర్ భగవత్ పాత్రలో నటించారు. యూపీలోని రాబర్ట్స్‌గంజ్‌లో ఒక మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అతను.. హత్యలు, హింసతో కూడిన చీకటి ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఈ చిత్రంలో జితేంద్ర కుమార్ విలన్ గా నటించారు. ఇది అక్టోబర్ 17న జీ5లో విడుదలవుతుంది.
సంతోష్
కారుణ్య నియామకం కింద పోలీసు ఉద్యోగం పొందిన ఒక వితంతువు కథతో సంధ్యా సూరి రూపొందించిన అవార్డు విన్నింగ్ చిత్రం 'సంతోష్'. ఈ థ్రిల్లర్ ఎట్టకేలకు భారతదేశంలో విడుదలవుతోంది. షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గత సంవత్సరం ఆస్కార్స్‌కు యూకే అధికారిక ఎంట్రీగా నిలిచింది. సీబీఎఫ్‌సీతో వివాదం కారణంగా థియేట్రికల్ విడుదల ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 17న లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది.
{{/usCountry}}కారుణ్య నియామకం కింద పోలీసు ఉద్యోగం పొందిన ఒక వితంతువు కథతో సంధ్యా సూరి రూపొందించిన అవార్డు విన్నింగ్ చిత్రం 'సంతోష్'. ఈ థ్రిల్లర్ ఎట్టకేలకు భారతదేశంలో విడుదలవుతోంది. షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గత సంవత్సరం ఆస్కార్స్‌కు యూకే అధికారిక ఎంట్రీగా నిలిచింది. సీబీఎఫ్‌సీతో వివాదం కారణంగా థియేట్రికల్ విడుదల ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 17న లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది.
{{/usCountry}}హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్
అందరూ ఇష్టపడే డిస్నీ క్లాసిక్ ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ లైవ్-యాక్షన్ వెర్షన్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. $365 మిలియన్లు వసూలు చేసింది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రంలో మాసన్ థేమ్స్, నికో పార్కర్, గాబ్రియేల్ హోవెల్, జూలియన్ డెన్నిసన్, బ్రాన్విన్ జేమ్స్, హ్యారీ ట్రెవాల్డ్విన్, పీటర్ సెరాఫినోవిచ్, నిక్ ఫ్రాస్ట్ నటించారు. యానిమేటెడ్ చిత్రాల నుంచి గెరార్డ్ బట్లర్ తన స్టోయిక్ ది వాస్ట్ పాత్రను మళ్లీ పోషించారు. ఇది అక్టోబర్ 13న జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసింది.
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్
ఫైనల్ డెస్టినేషన్ సిరీస్‌లోని కొత్త అధ్యాయం 'బ్లడ్‌లైన్స్'. ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ సిరీస్‌లోనే అత్యుత్తమ చిత్రంగా చాలా మంది అభివర్ణించిన 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్' 92% రాటెన్ టొమాటోస్ స్కోర్‌ను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా $315 మిలియన్లు వసూలు చేసింది. ఈ అతీంద్రియ హారర్ చిత్రం అక్టోబర్ 16న జియోహాట్‌స్టార్‌లో విడుదలవుతోంది.