...
...
Next Story

ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. హారర్ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వరకు.. స్ట్రీమింగ్ ఎక్కడో చూసేయండి

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది. ఇంకా వస్తోంది. ఇందులో థ్రిల్ తో అదరగొట్టే తెలుగు సినిమాలూ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.

Published on: Oct 18, 2025, 16:37:30 IST
Advertisement

హారర్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్లు, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్.. ఇలా వేర్వేరు జోనర్లలో తెలుగు సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చాయి. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు, సిరీస్ ఏవో చూసేద్దాం.

కిష్కింధపురి

ఓటీటీలోని తెలుగు సినిమాలు (x)
ఓటీటీలోని తెలుగు సినిమాలు (x)

ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన మూవీ కిష్కింధపురి. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ వేరే లెవల్ స్టోరీ లైన్ తో థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కిష్కింధపురి మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఘోస్ట్ హంటింగ్ టూర్ పేరుతో పాతబడ్డ భవనాల్లో దెయ్యాలున్నాయని చూపిస్తుంటారు హీరో, హీరోయిన్ అండ్ గ్యాంగ్. అలాంటి వాళ్లకు నిజంగానే దెయ్యం ఎదురైతే ఎలా ఉంటుందన్నదే కిష్కింధపురి సినిమా. ట్విస్ట్, థ్రిల్ తో ఈ మూవీ అసలు బోర్ కొట్టదు.

దక్ష

మంచు లక్ష్మి లీడ్ రోల్ ప్లే చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష-ది డెడ్లీ కాన్స్పిరసీ. ఇందులో మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ గా నటించింది. మాస్క్ మ్యాన్, ఏలియన్ దాడి, వింత వ్యాధి.. ఇలా మూడు అంశాల చుట్టూ సాగే ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఇది. ఇందులో కొన్ని హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దక్ష మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక మంచి ప్రేమకథ

హార్ట్ టచింగ్ గా అనిపించే లవ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి. ఈ సిరీస్ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులో భ్రమరాంబిక తుటిక, అభిషేక్ బొడ్డెపల్లి లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య పెళ్లి, లవ్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks