Tamil OTT: ఈ వారం ఓటీటీలోని ఈ తమిళ సినిమాలు చూశారా? అదిరే హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లు
Tamil OTT: ఓటీటీలో ఈ వారం తమిళ సినిమాలు జోరుమీదున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్నాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్కేయండి. ఇందులో హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లున్నాయి.
ఓటీటీలో డిఫరెంట్ జోనర్లలో వేర్వేరు భాషల సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఓటీటీల డిమాండ్ ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లున్నాయి. మరి వెంటనే వీటిపై ఓ లుక్కేయండి.

శబ్దం ఓటీటీ
ఓటీటీలోకి ఏడాది తర్వాత వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అరివళగన్ డైరెక్టర్. 2025 ఫిబ్రవరిలో థియేటర్లో రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.
స్టోరీ ఏంటంటే?
మున్నార్ లోని మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా కాలేజీ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఓ ఘోష్ట్ ఇన్వెస్టిగేటర్ గా వైద్య లింగం (ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు కనిపెడతాడు. మరి ఆ ఆత్మల కథ ఏంటీ? అన్నది శబ్దం సినిమాలో చూడాల్సిందే.
మాయాబింబం ఓటీటీ
మాయాబింబం అనేది తమిళ రొమాంటిక్ థ్రిల్లర్. ఇది జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఈ హిట్ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.
మాయాబింబం సినిమాలో ఆకాష్ నటరాజన్, జానకి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి కేజే సురేందర్ డైరెక్టర్. 2005లో జరిగే లవ్ స్టోరీగా మాయాబింబం సినిమా తెరకెక్కింది.
మలయాళంలో ఇలా
మరోవైపు మలయాళం సినిమాలు కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మస్తిష్క మరణం’, క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశాతే కల్లన్’ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్నాయి.
వర్చువల్ రియాలిటీకి, రియాలిటీకి మధ్య తేడా తెలుసుకోవడం కన్ఫ్యూజ్ అయ్యే ఓ తండ్రి కథతో మస్తిష్క మరణం మూవీ సాగుతుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వలతు వశాతే కల్లన్ లో ట్విస్ట్ లు అదిరిపోయాయి. ఇంకెందుకు లేటు ఈ వీకెండ్ కు ఈ తమిళ్, మలయాళం మూవీస్ పై ఓ లుక్కేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


