Tamil Thrillers OTT: గ్లామర్ టు థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీలోని అదిరిపోయే తమిళ సినిమాలు.. మిస్ అవొద్దు!
Tamil Thrillers OTT: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే! ఈ వారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సోనీ లివ్, జీ5, అమెజాన్ ప్రైమ్, ఆహా తదితర యాప్స్‌లో ఏకంగా 7 క్రేజీ తమిళ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా 'మీసయ మురుక్కు 2', 'నూరు కోడి వానవిల్' లాంటి సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి.
Tamil Thrillers OTT: థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు సినీ ప్రియులు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి వారం లాగే ఈ వారం కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి భారీ కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్ల సినిమాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

మీసయ మురుక్కు 2 (Meesaya Murukku 2)
హిప్ హాప్ తమిజా హీరోగా నటించిన 'మీసయ మురుక్కు' మొదటి భాగం మ్యూజికల్ గా, కమర్షియల్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన 'మీసయ మురుక్కు 2' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLiv) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం విశేషం. యూత్ ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నూరు కోడి వానవిల్ (Nooru Kodi Vaanavil)
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం 'నూరు కోడి వానవిల్'. విభిన్నమైన కథాంశంతో, బలమైన ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జీ5 (Zee5) లో సందడి చేయనుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం తమిళానికే పరిమితం చేయకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. మంచి సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా వీకెండ్ వాచ్‌కి బెస్ట్ ఛాయిస్.
ఈ క్రేజీ మూవీస్
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సన్ నెక్స్ట్ (Sun nxt) యాప్ 'ది గ్రాండ్ మాస్టర్' (The Grand Master) చిత్రాన్ని తీసుకొస్తోంది. సీట్ ఎడ్జ్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్ థ్రిల్లర్ అభిమానులకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇక ఆహా తమిళ (Aha Tamil) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో '7 స్టార్ బాయ్స్' (7 star boys) సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రం యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో..
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో ఈ వారం 'ఆల్ పాస్' (All Pass) అనే విభిన్నమైన తమిళ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. నేటి విద్యావ్యవస్థ, విద్యార్థుల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ అందరినీ ఆలోచింపజేస్తుంది. అలాగే సింప్లీ సౌత్ (SimplySouth) యాప్‌లో 'ఏంజెలినా' (Angelina) అనే ఫీల్ గుడ్ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇక సస్పెన్స్ మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారి కోసం ఆస్ట్రో మూవీస్ (Astro Movies) యాప్ లో 'లక్ష్మీ కాంతన్ కొలై వళక్కు' (Lakshmi kanthan KolaiV azhakku) స్ట్రీమింగ్ అవుతోంది.
మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఓటీటీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఉంది. మీకు నచ్చిన జానర్ మూవీని సెలెక్ట్ చేసుకుని ఈ వీకెండ్ ను మరింత ఎంటర్టైనింగ్ గా మార్చుకోండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


