This Week OTT: ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్ టు కామెడీ డ్రామా.. పీక్ ఎంటర్‌టైన్మెంట్..లుక్కేయండి
This Week OTT: ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల సందడి అదిరిపోతుంది. డిఫరెంట్ జోనర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇందులో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో డిఫరెంట్ జానర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇందులో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామాలున్నాయి. హే బల్‌వంత్ నుంచి మృత్యుంజయ్ వరకు ఈ వారం ఓటీటీలో చూసేయండి.

హే బల్‌వంత్ ఓటీటీ
తెలుగులో రీసెంట్ గా వచ్చిన మూవీ హే బల్‌వంత్. ఇందులో సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. తండ్రి బిజినెస్ ను టేకప్ చేసే కొడుకుగా సుహాస్ ఇందులో నవ్వులు పూయించాడు. ఆ సీక్రెట్ బిజినెస్ ఏంటో తెలుసుకుని హీరో షాక్ అవుతాడు. ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
మృత్యుంజయ్ ఓటీటీ
శ్రీ విష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. రీసెంట్ గా థియేటర్లలో ఈ మూవీ అదరగొట్టింది. ఏప్రిల్ 3న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగే వరుస అనుమానాస్పద మరణాల చుట్టూ సాగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది.
ఒక మార్కెటింగ్ ఉద్యోగి ప్రాణాలకు తెగించి సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మరో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఇది ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులో శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నమయ్య జిల్లా కొత్తపేట నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక పంచాయితీ కార్యదర్శి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు.
తన ఇంట్లో చనిపోయి ఉన్న ఎస్ఐ మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆ కార్యదర్శి కుటుంబం చేసే ప్రయత్నాలు కామెడీతో పాటు థ్రిల్ పంచుతాయి.
యూఫోరియా
డ్రగ్స్ మత్తులో యూత్ ఎలా మునిగిపోయిందనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన సినిమా యూఫోరియా. ఇది ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. భూమిక చావ్లా, సారా అర్జున్ నటించిన ఈ సినిమా 2022లో జూబ్లీహిల్స్‌లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
ఒక పార్టీలో ఐదుగురు యువకులు డ్రగ్స్ తీసుకుంటారు. మత్తులో ఓ అమ్మాయిని రేప్ చేస్తారు. న్యాయం కోసం ఆ అమ్మాయి ఎలా పోరాడింది? ఇందులో భూమిక క్యారెక్టర్ ఏంటీ? అన్నది ఓటీటీలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


